ప్రకాశం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్
ప్రకాశం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్
దర్శి నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో చిన్న చిన్న వివాదాల కారణంగా అమాయక ప్రజలపై పెట్టిన కేసులు తొలగించాలని తన వినతికి సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ కి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం తన ఛాంబర్ లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ని మర్యాదపూర్వకంగా కలుసుకొని శాంతి భద్రతలపై చర్చించారు.
ఆమెతోపాటు తెలుగుదేశం పార్టీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కూడా ఉన్నారు. రాజకీయాలకు అతీయుతంగా అమాయక ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం శుభపరిణామం అని రాజకీయాల కోసం కక్ష సాధింపులు సరికాదని డాక్టర్ లక్ష్మీ అభిప్రాయపడ్డారు. తమ విజ్ఞప్తిని మన్నించి నియోజకవర్గంలో ఇప్పటికే అక్రమ కేసులు తొలగింపులను ప్రారంభించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.
మరి కొన్ని గ్రామాలలో దర్శి పట్టణంలో ఉన్న అక్రమ కేసులు, అమాయకులపై ఉన్న కేసులు, రాజకీయ కక్షలతో కూడిన కేసులు, అమాయకులపై రౌడీ షీట్లను తొలగించి గ్రామాల్లో రైతులపై, కూలీలపై ఉన్న బైండోవర్ కేసులను తొలగించేందుకు ఆలోచన చేయాలని డాక్టర్ లక్ష్మీ ఎస్పీ గారిని కోరడం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దర్శి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా ప్రశాంతంగా ఉండడానికి సహకరించిన పోలీస్ శాఖను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక సిబ్బందితోపాటు మీ సంపూర్ణ సహకారంతో దర్శి ప్రాంతంలో ప్రజలు స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు.
ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా కూడా ఇలాంటి వివాదాలు లేకుండా ఘర్షణ లేకుండా ప్రజలందరూ కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా సంక్రాంతి జరుపుకునేందుకు పోలీస్ శాఖ సహకారం అందించాలని డాక్టర్ లక్ష్మీ కోరారు.
What's Your Reaction?