వర్షాన్ని సైతం లెక్కచేయక పింఛన్ల పంపిణీ చేసిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
వర్షాన్ని సైతం లెక్కచేయక పింఛన్ల పంపిణీ చేసిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణం, శివరాజ్ నగర్ లో పింఛన్ల పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు ఉన్నారు.
నెలలో ఒకటో తారీఖు ముందే ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయడమనేది దేశ చరిత్రలో ప్రథమం అని దర్శి టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.
పింఛన్ల పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే.. చాలా సంతోషంగా ఉందని ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుంభవృష్టిగా కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయక వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె వెల్లడించారు.
వర్షంలోనూ ప్రభుత్వ అధికార యంత్రాంగం పింఛన్లు పంపిణీ చేయడం, లబ్ధిదారులతో మాట్లాడడం అందరినీ ఆకర్షించిందన్నారు.. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 1న సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని.. లబ్ధిదారుల సంక్షేమం కోసం ఆలోచించే కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో దర్శి లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
What's Your Reaction?