ప్రకాశం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ని శుక్రవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ తో దర్శి నియోజకవర్గంలో శాంతి భద్రతలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో దర్శిలో ప్రశాంతతకు కృషిచేసిన పోలీస్ యంత్రాంగానికి డాక్టర్ లక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్పీ గారిని కలిసిన వారిలో డా|| లక్ష్మీ తో పాటు దర్శి టిడిపి నాయకులు దారం సుబ్బారావు , నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పుల్లలచరువు సత్యనారాయణ , ఐ.టిడిపి నియోజకవర్గ అధ్యక్షులు యస్. వి. రామయ్య ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి ఎస్పీ తో మాట్లాడుతూ "అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నేతల ఒత్తిడితో అమాయకులపై కేసులు బనాయించారని వెంటనే ఆ కేసులను తొలగించాలని ఆమె కోరారు. అనేక ఎలక్షన్ బూత్ ల వద్ద జరిగిన చిన్న చిన్న వివాదాల నేపథ్యంలో అమాయక ప్రజలపై కేసులు ఉన్నాయని అన్నారు. ఈ కేసులను బనాయించేందుకు పోలీస్ శాఖ పై ఒత్తిడి చేశారని, రాజకీయాలకు అతీతంగా అమాయక ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కేసులు తొలగించాలని ఆమె కోరారు.
కొందరు తెలుగుదేశం ముఖ్యనేతలపై కావాలనే కక్ష సాధింపు తో వైసీపీ నేతలు రౌడీ షీట్లు కూడా తెరిపించారని, వెంటనే వాటన్నింటినీ విచారించి పారదర్శకంగా రౌడీ షీట్ లను తొలగించాలని, కేసులను కూడా ఎత్తివేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎస్పీ దామోదర్ సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ లక్ష్మీ ఈ సందర్భంగా వివరించారు. బొట్లపాలెం, వీరాయపాలెం, దర్శి కురిచేడు రోడ్ NAP ఆఫీస్ వద్ద ఎన్నికల రోజు జరిగిన ఘర్షణల అక్రమంగా బానాయించిన కేసులను తొలగించే విదంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె వివరించారు. #GottipatiLakshmi #LakshmiForDarsi #DrLalithKadiyala #ITDPDarsi #DarsiDevelopmentWithLakshmi #TeamLakshmiGottipati
What's Your Reaction?