దర్శి: ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మి
దర్శి: ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మి

దర్శి లో ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ. దర్శి మండలం, దర్శి టౌన్ లో శనివారం అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా, దర్శి గడియార స్థంభం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి మరియు స్వర్గీయ నారపుశెట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్. తదుపరి పి.జి.యన్ తాలూకా క్లబ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, పట్టణ అధ్యక్షులు వాసు, తెలుగు యువత అధ్యక్షులు చిన్న, నీటిసంగం అధ్యక్షులు DC ఎలుగొండారెడ్డి, దారం సుబ్బారావు, , సంగా తిరుపతి రావు, శోభరణి, దర్శి మండలం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
What's Your Reaction?






