Demonty Colony 2 - Not scary రివ్యూ : డీమోంటీ కాలనీ 2 - భయపెట్టలేదు

రివ్యూ : డీమోంటీ కాలనీ 2 తారాగణం : అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్, అరుణ్ పాండియన్, మీనాక్షి గోవింద రాజన్, జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ ఎడిటింగ్ : కుమరేష్ డి సంగీతం : శామ్ సి.ఎస్ సినిమాటోగ్రఫీ : హరీష్ కన్నన్ నిర్మాతలు : విజయ సుబ్రహ్మణియన్, ఆర్.సి. రాజ్ కుమార్ దర్శకత్వం : అజయ్ ఆర్. జ్ఞానముత్తు హారర్ థ్రిల్లర్స్ ను కాస్త జాగ్రత్తగా రాసుకుంటే ఎప్పుడైనా ఆకట్టుకుంటాయి. ఎంచుకున్న కంటెంట్ నుంచి డీవియేట్ కాకుండా చెప్పాలనుకున్నది స్ట్రెయిట్ గా చెప్పగలిగితే కమర్షియల్ గానూ హిట్ అనిపించుకుంటాయి. కొన్నాళ్ల క్రితం తమిళ్ నుంచి డబ్బింగ్ సినిమాగా వచ్చిన డీమాంటే కాలనీ తెలుగులోనూ ఆకట్టుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు డీమాంటే కాలనీ 2 వచ్చింది. తమిళ్ లో ఆల్రెడీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తెలుగులో ఎలా ఉందో చూద్దాం. కథ : డెబ్బీ ( ప్రియా భవానీ శంకర్) ఒక రెస్టారెంట్ నడుపుతుంది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్యామ్ ఆరేళ్ల క్రితమే చనిపోతాడు. అయినా అతని జ్ఞాపకాలు మర్చిపోలేకపోతుంది. అతని ఆత్మ తనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందని తన మామ( అరుణ్ పాండియన్ ) తో కలిసి బుద్ధిస్ట్ మాంక్స్ దగ్గర తన భర్త ఆత్మను కలిసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు శ్రీనివాస్, రఘురామ్ ( అరుళ్ నిధి -డ్యూయొల్ రోల్ ) చాలా ప్రమాదంలో ఉన్నారని తెలుస్తుంది. అంతే కాదు.. వీరిని కాపాడితే.. తన ఆత్మ శాంతిస్తుందని కూడా అర్థం అవుతుంది. వారి గురించి తెలుసుకునే క్రమంలో డెబ్బీకి సంచలన విషయాలు తెలుస్తాయి.ముఖ్యంగా ఒక లైబ్రరీలోని ‘అన్‌సంగ్ కింగ్ ఆఫ్ ఎ ఫాలెన్ కింగ్‌డమ్’అనే శపించబడిన పుస్తకం చదివిన వాళ్లంతా మరణిస్తున్నారనీ.. తన భర్త కూడా అది చదివాకే మరణించాడని అర్థం అవుతుంది. ఇలా ఆరేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ యేడాది ఎవరు చనిపోతున్నారు అని తెలుసుకుని ఆ చావును ఆపగలిగితే ఆ పుస్తక శాపం తొలగిపోతుందని తెలుసుకుంటుంది. మరి ఆ పుస్తకంలో ఏముంది..? ఆరేళ్లకే ఇలా ఎందుకు జరుగుతుంది.. ఈ చావులను డెబ్బీఅరికట్టిందా.. అసలు ఈ శ్రీనివాస్, రఘురామ్ ఎవరు.. అనేది మిగతా కథ. విశ్లేషణ : సీక్వెల్ అంటే ఎలా స్టార్ట్ కావాలో అలాగే స్టార్ట్ అవుతుందీ సినిమా. ఫస్ట్ పార్ట్ చివర్లో ఏం జరిగిందో అక్కడి నుంచి మొదలై.. ప్రతి ఆరేళ్లకు జరిగే సంఘటనలతో కదులుతూ.. 2021లో జరిగే కథగా డీమోంటీ కాలనీ 2 కనిపిస్తుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో చెప్పిన ఈ కథ ఫస్ట్ పార్ట్ చూడని వారికి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కానీ అర్థం అవుతుంది. చాలా సాధారణంగా మొదలై.. డిఫరెంట్ లేయర్స్ గా మారుతూ.. ఫస్ట్ హాఫ్ అంతా చక చకా సాగుతుంది. ముఖ్యంగా శ్రీనివాస్, రఘురామ్ ఎపిసోడ్ తో పాటు ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆత్మను వెదుకుతూ వెళ్లే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇవన్నీ ఓ హారర్ థ్రిల్లర్ కు సరిపడా కంటెంట్ త కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ను గ్రిప్పింగ్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో కాస్త ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా కథ ‘రెస్టారెంట్’ స్ట్రక్ అయిన ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుంది. అయినా అర్థవంతమైన ముగింపు కాకుండా మరో పార్ట్ కు దారి వేసుకుని.. ఈ చావులు.. ఆ రహస్య పుస్తకం ఎవరి చేతిలో ఉంది అనేది చెప్పకుండా మరో పార్ట్ కూడా ఉందని ఎండ్ కార్డ్ వేశాడు. ఇలాంటి మూవీస్ కు ఎక్కువ విశ్లేషణ చేసినా కొత్తగా చూసేవారికి ఆ ఫీల్ పోతుంది. నటన పరంగా అందరూ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ప్రియా భవానీ శంకర్ మెయిన్ లీడ్ తీసుకుని అంతా తానే అయ్యి ఈ కథను ముందుకు నడిపిస్తుంది. అరుళ్ నిధి డ్యూయొల్ రోల్ అయినా ఒక పాత్ర పూర్తిగా అచేతనంగా ఉంటుంది. అయితే ఉన్న పాత్రతో చూపించిన రెస్టారెంట్ సీన్స్ భయం కలిగిస్తాయి. కానీ అందుకు భిన్నంగా ఆ పాత్రను ప్రజెంట్ చేశాడు దర్శకుడు. అరుణ్ పాండియన్ పాత్రకు సరైన ఎండింగ్ లేదు. బుద్ధిస్ట్ మాంక్ గా చేసినతను బాగా నటించాడు. మిగతా అంతా ఓకే. టెక్నికల్ గా డీమోంటీ కాలనీ 2కి బిగ్గెస్ట్ ఎసెట్ శామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోయినా.. తన ఆర్ఆర్ తో భయపెట్టాడు. అలాగని హెవీ సౌండింగ్ లేదు. సీన్ కు తగ్గట్టుగా కంపోజ్ చేశాడు. ఎడిటింగ్ పరంగా సెకండ్ హాఫ్ లో కాస్త ట్రిమ్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఓకే. తెలుగు డైలాగులు, డబ్బింగ్ బావున్నాయి. దర్శకుడు అజయ్ స్టోరీ నుంచి ఎక్కడా డీవియేట్ కాలేదు. హీరోల మధ్య ఆస్తి పంపకాల టైమ్ లో కథ పక్కకు వెళుతుందేమో అనిపిస్తుంది. బట్.. దాన్ని కథకు లింక్ చేసి ట్రాక్ లోనే ఉన్నానని చెప్పాడు. మొత్తంగా ఇది మరీ వెన్నులో వణుకు పుట్టించేంత హారర్ మూవీ కాదు. ఆ మాటకొస్తే.. రెగ్యులర్ గా హారర్ మూవీస్ చూసే వారికి అసలు భయం కలగదు. కానీ ఆ మూడ్ ను క్రియేట్ చేస్తాడు. ఫైనల్ గా : భయం లేదు.. ఫీలింగ్ ఉంది రేటింగ్ : 2.5/ 5 - కామళ్ల. బాబురావు

Aug 23, 2024 - 19:15
 0  1
Demonty Colony 2 - Not scary
రివ్యూ : డీమోంటీ కాలనీ 2 - భయపెట్టలేదు

రివ్యూ : డీమోంటీ కాలనీ 2

తారాగణం : అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్, అరుణ్ పాండియన్, మీనాక్షి గోవింద రాజన్, జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ

ఎడిటింగ్ : కుమరేష్ డి

సంగీతం : శామ్ సి.ఎస్

సినిమాటోగ్రఫీ : హరీష్ కన్నన్

నిర్మాతలు : విజయ సుబ్రహ్మణియన్, ఆర్.సి. రాజ్ కుమార్

దర్శకత్వం : అజయ్ ఆర్. జ్ఞానముత్తు

హారర్ థ్రిల్లర్స్ ను కాస్త జాగ్రత్తగా రాసుకుంటే ఎప్పుడైనా ఆకట్టుకుంటాయి. ఎంచుకున్న కంటెంట్ నుంచి డీవియేట్ కాకుండా చెప్పాలనుకున్నది స్ట్రెయిట్ గా చెప్పగలిగితే కమర్షియల్ గానూ హిట్ అనిపించుకుంటాయి. కొన్నాళ్ల క్రితం తమిళ్ నుంచి డబ్బింగ్ సినిమాగా వచ్చిన డీమాంటే కాలనీ తెలుగులోనూ ఆకట్టుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు డీమాంటే కాలనీ 2 వచ్చింది. తమిళ్ లో ఆల్రెడీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తెలుగులో ఎలా ఉందో చూద్దాం.

కథ :

డెబ్బీ ( ప్రియా భవానీ శంకర్) ఒక రెస్టారెంట్ నడుపుతుంది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్యామ్ ఆరేళ్ల క్రితమే చనిపోతాడు. అయినా అతని జ్ఞాపకాలు మర్చిపోలేకపోతుంది. అతని ఆత్మ తనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందని తన మామ( అరుణ్ పాండియన్ ) తో కలిసి బుద్ధిస్ట్ మాంక్స్ దగ్గర తన భర్త ఆత్మను కలిసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు శ్రీనివాస్, రఘురామ్ ( అరుళ్ నిధి -డ్యూయొల్ రోల్ ) చాలా ప్రమాదంలో ఉన్నారని తెలుస్తుంది. అంతే కాదు.. వీరిని కాపాడితే.. తన ఆత్మ శాంతిస్తుందని కూడా అర్థం అవుతుంది. వారి గురించి తెలుసుకునే క్రమంలో డెబ్బీకి సంచలన విషయాలు తెలుస్తాయి.ముఖ్యంగా ఒక లైబ్రరీలోని ‘అన్‌సంగ్ కింగ్ ఆఫ్ ఎ ఫాలెన్ కింగ్‌డమ్’అనే శపించబడిన పుస్తకం చదివిన వాళ్లంతా మరణిస్తున్నారనీ.. తన భర్త కూడా అది చదివాకే మరణించాడని అర్థం అవుతుంది. ఇలా ఆరేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ యేడాది ఎవరు చనిపోతున్నారు అని తెలుసుకుని ఆ చావును ఆపగలిగితే ఆ పుస్తక శాపం తొలగిపోతుందని తెలుసుకుంటుంది. మరి ఆ పుస్తకంలో ఏముంది..? ఆరేళ్లకే ఇలా ఎందుకు జరుగుతుంది.. ఈ చావులను డెబ్బీఅరికట్టిందా.. అసలు ఈ శ్రీనివాస్, రఘురామ్ ఎవరు.. అనేది మిగతా కథ.

విశ్లేషణ :

సీక్వెల్ అంటే ఎలా స్టార్ట్ కావాలో అలాగే స్టార్ట్ అవుతుందీ సినిమా. ఫస్ట్ పార్ట్ చివర్లో ఏం జరిగిందో అక్కడి నుంచి మొదలై.. ప్రతి ఆరేళ్లకు జరిగే సంఘటనలతో కదులుతూ.. 2021లో జరిగే కథగా డీమోంటీ కాలనీ 2 కనిపిస్తుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో చెప్పిన ఈ కథ ఫస్ట్ పార్ట్ చూడని వారికి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కానీ అర్థం అవుతుంది. చాలా సాధారణంగా మొదలై.. డిఫరెంట్ లేయర్స్ గా మారుతూ.. ఫస్ట్ హాఫ్ అంతా చక చకా సాగుతుంది. ముఖ్యంగా శ్రీనివాస్, రఘురామ్ ఎపిసోడ్ తో పాటు ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆత్మను వెదుకుతూ వెళ్లే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇవన్నీ ఓ హారర్ థ్రిల్లర్ కు సరిపడా కంటెంట్ త కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ను గ్రిప్పింగ్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో కాస్త ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా కథ ‘రెస్టారెంట్’ స్ట్రక్ అయిన ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుంది. అయినా అర్థవంతమైన ముగింపు కాకుండా మరో పార్ట్ కు దారి వేసుకుని.. ఈ చావులు.. ఆ రహస్య పుస్తకం ఎవరి చేతిలో ఉంది అనేది చెప్పకుండా మరో పార్ట్ కూడా ఉందని ఎండ్ కార్డ్ వేశాడు. ఇలాంటి మూవీస్ కు ఎక్కువ విశ్లేషణ చేసినా కొత్తగా చూసేవారికి ఆ ఫీల్ పోతుంది.

నటన పరంగా అందరూ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ప్రియా భవానీ శంకర్ మెయిన్ లీడ్ తీసుకుని అంతా తానే అయ్యి ఈ కథను ముందుకు నడిపిస్తుంది. అరుళ్ నిధి డ్యూయొల్ రోల్ అయినా ఒక పాత్ర పూర్తిగా అచేతనంగా ఉంటుంది. అయితే ఉన్న పాత్రతో చూపించిన రెస్టారెంట్ సీన్స్ భయం కలిగిస్తాయి. కానీ అందుకు భిన్నంగా ఆ పాత్రను ప్రజెంట్ చేశాడు దర్శకుడు. అరుణ్ పాండియన్ పాత్రకు సరైన ఎండింగ్ లేదు. బుద్ధిస్ట్ మాంక్ గా చేసినతను బాగా నటించాడు. మిగతా అంతా ఓకే.

టెక్నికల్ గా డీమోంటీ కాలనీ 2కి బిగ్గెస్ట్ ఎసెట్ శామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోయినా.. తన ఆర్ఆర్ తో భయపెట్టాడు. అలాగని హెవీ సౌండింగ్ లేదు. సీన్ కు తగ్గట్టుగా కంపోజ్ చేశాడు. ఎడిటింగ్ పరంగా సెకండ్ హాఫ్ లో కాస్త ట్రిమ్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఓకే. తెలుగు డైలాగులు, డబ్బింగ్ బావున్నాయి.

దర్శకుడు అజయ్ స్టోరీ నుంచి ఎక్కడా డీవియేట్ కాలేదు. హీరోల మధ్య ఆస్తి పంపకాల టైమ్ లో కథ పక్కకు వెళుతుందేమో అనిపిస్తుంది. బట్.. దాన్ని కథకు లింక్ చేసి ట్రాక్ లోనే ఉన్నానని చెప్పాడు. మొత్తంగా ఇది మరీ వెన్నులో వణుకు పుట్టించేంత హారర్ మూవీ కాదు. ఆ మాటకొస్తే.. రెగ్యులర్ గా హారర్ మూవీస్ చూసే వారికి అసలు భయం కలగదు. కానీ ఆ మూడ్ ను క్రియేట్ చేస్తాడు.

ఫైనల్ గా : భయం లేదు.. ఫీలింగ్ ఉంది

రేటింగ్ : 2.5/ 5

- కామళ్ల. బాబురావు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News