Dengue : డెంగ్యూ కట్టడికి స్పెషల్ డ్రైవ్ చేపట్టండి : మంత్రి దామోదర

రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతుంటే ఏం చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ అధకారులపై మంత్రి దామోదర రాజనర్సింహా సీరియస్ అయ్యారు. డెంగ్యూ వ్యాధి నియంత్రణపై అలసత్వం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం సెక్రటేరియట్ లో వైదార్యోగ్యంపై ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ అనంతరం వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల కట్టడికి చేపట్టిన చర్యలపై తనకు ప్రత్యేక రిపోర్టు వెంటనే అందజేయాలని కోరారు. వ్యాధిని కంట్రోల్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే డెంగ్యూ కట్టడిపై రాష్ట్ర స్థాయిలో డీహెచ్ ఆధ్వర్యంలో.. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కంట్రోల్ రూమ్‌కు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల వివరాలు, కేసు స్టడీస్ అన్ని నమోదు కావాలన్నారు.ఈ కంట్రోల్ రూమ్ నుంచే పేషెంట్ల చికిత్సపై ఆరా తీయాలన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ కట్టడికి స్పెషల్ డ్రైవ్‌ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులను ఆదేశించారు.

Aug 28, 2024 - 23:33
 0  2
Dengue : డెంగ్యూ కట్టడికి స్పెషల్ డ్రైవ్ చేపట్టండి : మంత్రి దామోదర

రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతుంటే ఏం చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ అధకారులపై మంత్రి దామోదర రాజనర్సింహా సీరియస్ అయ్యారు. డెంగ్యూ వ్యాధి నియంత్రణపై అలసత్వం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం సెక్రటేరియట్ లో వైదార్యోగ్యంపై ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ అనంతరం వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల కట్టడికి చేపట్టిన చర్యలపై తనకు ప్రత్యేక రిపోర్టు వెంటనే అందజేయాలని కోరారు. వ్యాధిని కంట్రోల్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే డెంగ్యూ కట్టడిపై రాష్ట్ర స్థాయిలో డీహెచ్ ఆధ్వర్యంలో.. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు.

ఆయా కంట్రోల్ రూమ్‌కు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల వివరాలు, కేసు స్టడీస్ అన్ని నమోదు కావాలన్నారు.ఈ కంట్రోల్ రూమ్ నుంచే పేషెంట్ల చికిత్సపై ఆరా తీయాలన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ కట్టడికి స్పెషల్ డ్రైవ్‌ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులను ఆదేశించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News