Deputy CM Pawan Kalyan: ఘనంగా జన్మదిన వేడుకలు- దర్శి టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్
Deputy CM Pawn Kalyan: ఘనంగా జన్మదిన వేడుకలు- దర్శి టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్
Darsi: ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా దొనకొండలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాలలో మన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.
అనంతరం ఈ సందర్భంగా జరిగిన అన్నదానాన్ని ప్రారంభించారు ఆ తర్వాత గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవ ప్రాధాన్యతను డాక్టర్ లక్ష్మి వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ తుఫాను విపత్తులో అంత వయసులో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు రాత్రంతా నిద్రపోకుండా అధికారులతో కలిసి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా ఆహారం మందులు సకాలంలో అందే విధంగా కలెక్టరేట్లో బసచేసిన ప్రజా సేవకుడైన మన ముఖ్యమంత్రి ని చూశారు ఆయన స్ఫూర్తితో రాజకీయాలంటే సేవా దృక్పథంతో యువత ముందుకు వచ్చి పని చేయాలని కోరారు.
అదేవిధంగా మన ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి వంటి గారి సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వంలో ఉండడం మనందరికీ గర్వకారణమని ఆమె వివరించారు ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వలసలను నివారించేందుకు దర్శి ప్రాంతంలో హెచ్ సి ఓ సమస్త సహకారంతో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ఒక మంచి కార్యక్రమాన్ని దర్శి ప్రాంతంలో చేపట్టినట్టు డాక్టర్ లక్ష్మీ వివరించారు ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ బర్తడే సందర్భంగా మనం ప్రారంభించుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె వివరించారు.
What's Your Reaction?