Dr.Gottipati Lakshmi: వరద బాధితులకు 10 లక్షల సాయం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు...
Dr.Gottipati Lakshmi: వరద బాధితులకు 10 లక్షల సాయం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు...
వరద బాధితులకు గొట్టిపాటి లక్ష్మి 10 లక్షల సాయం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు. దర్శి టిడిపి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి దాతృత్వం చాటుకున్నారు. బెజవాడ వరద బాధితులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించారు. ఇటీవల దర్శి ప్రజల నుండి స్వచ్ఛందంగా సేకరించిన విరాళాల మొత్తం 37 లక్షల 16 వేల 200 రూపాయల ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు. అంతేకాక తన సొంత నిధుల నుండి 10 లక్షల రూపాయలను కలిపి మొత్తం 47 లక్షల రూపాయల 16 వేల 200 రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని విజయవాడ వరద బాధితుల కొరకు సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే పాపారావు, చైర్మన్ పిచ్చయ్య, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, నెమలయ్య, శ్రీనివాసరావు, ఐటీడీపీ అంజిబాబు, టిడిపి నాయకులు శేఖర్ పంతులు, జూపల్లి కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?