వైసీపీ తప్పుడు ఆరోపణలపై తీవ్రంగా ఖండించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
వైసీపీ తప్పుడు ఆరోపణలపై తీవ్రంగా ఖండించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

వారు చేసిన పాపాల పరిహారమే నేడు ప్రజలపై విద్యుత్ భారాలని, ఆ విషయం ప్రజలకు తెలుసని, ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తే నమ్మే పరిస్థితుల్లో లేరని డాక్టర్ లక్ష్మీ వివరించారు. మైలవరం సోలార్ ప్లాంట్ ధ్వంసం చేసింది. దొంగే దొంగ దొంగ అన్నట్లు కరెంటు చార్జీలు పెంచడానికి కారణమైన వైసిపి మళ్లీ వైసీపీ నే ధర్నాలకు దిగడం మరోసారి ప్రజలను మోసం చేయడమే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ విద్యుత్తు భారానికి కారణమైన వైసీపీ తప్పుడు ఆరోపణలపై డాక్టర్ లక్ష్మీ తీవ్రంగా ఖండించారు.
అధికారం కోల్పోయాక ప్రజలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. వారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో పది సార్లు కరెంటు చార్జీలు పెంచారు, లక్ష కోట్లు ప్రజలపై భారం విధించారు. కమిషన్ కు కక్కుర్తి పడి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. మీరు కాదా, కమిషన్ల కోసం ట్రూ ఆఫ్ చార్జెస్ అనే కొత్త పదాలను తీసుకువచ్చి, మిగులుగా ఉన్న విద్యుత్తును నాశనం చేసి అధికరేట్లకు విద్యుత్తును కొని ఆదాయం చేసుకున్న చీకటి ఒప్పందాలలో భాగంగానే తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం కొంత మేర విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 200 చెల్లించే విద్యుత్ ఛార్జీలు 2000 నుండి 3000 వరకు సామాన్య ప్రజలపై భారం అవుతారని ఆమె వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ చార్జీలు ఉండవని చెప్పి దగా చేశారని ఆమె అన్నారు.
ఇలా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి మిగులు విద్యుత్తు ఉన్న రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. గత వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు 22 మెగావాట్ల అదనపు విద్యుత్తు నుంచి నప్పటికీ... కమిషన్ల కోసం విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపిన పాపం వైసీపీది కాదా అని ఆమె ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి, జగన్ అండ్ కో చేసిన పాపాల పరిహారమే నేడు విద్యుత్ ఛార్జీల పెంపు అని ఆమె ధ్వజ మెత్చారు. ప్రభుత్వా నిబంధనలకు విరుద్ధంగా పిపిఏలను రద్దు చేయడం వేల ఓల్ట్ల విద్యుత్తు రావాల్సి ఉండగా వీరి విధ్వంశాల వల్ల రాయలసీమ ప్రకాశం వంటి వెనకబడిన జిల్లాలకు ఉపాధి అవకాశాలు కోల్పోయి విద్యుత్ విధ్వంసం జరిగిందని ఆమె ధ్వజమెత్తారు. పదివేల అదనపు విద్యుత్తు ఉండేది అన్నారు, పోలవరం ప్రాజెక్టు 2021 లో పూర్తి చేయకపోవడం వల్ల 4700 కోట్లు నష్టపోయామని ఆమె అన్నారు. జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయిరెడ్డి నాసిరకం బొగ్గు సరఫరా చేయడం కమిషన్లకు కక్కుర్తి పడడమేనని ఆమె అన్నారు.
విద్యుత్ సంస్థలపై 49 వేల కోట్లు అప్పుల భారం మోపిన గత వైసిపి ప్రభుత్వం కొత్తగా విద్యుత్తును మాత్రం సరఫరా చేసిన దాఖలాలు లేవన్నారు. కృష్ణపట్నం పోర్టు విద్యుత్తు ఉత్పత్తికి సిద్ధమైనప్పటికీ వారిని ప్రోత్సహించకుండా, ప్రారంభించకుండా మోకాలు అడ్డు తగిలి అదనపు భారంతో విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలపై భారం అవుతారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతలు సృష్టించి సర్ చార్జీలతో విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలపై 2 వేల700 కోట్ల భారాన్ని మోపిన వైసీపీ వారు ధర్నాలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ స్మార్ట్ మీటర్స్ పేరుతో కూడా కమిషన్లు తీసుకుని దోపిడీ చేశారన్నారు.
చీకటి విద్యుత్ ఒప్పందంపై అమెరికాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదవడం, విద్యుత్తు అవకతవకలు అవినీతి బయటపడడంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఆందోళనలు పేరుతో దగా చేస్తున్నారన్నారు. విద్యుత్తు కొనుగోళ్లలో అధిక వడ్డీరేట్లతో పదివేల ఎనిమిది వందల కోట్ల భారం ప్రజలపై పడిందని ఆమె వివరించారు. ఇలా గత ఐదేళ్లలో చేసిన చీకటి ఒప్పందాలలో ఈ విద్యుత్ ఒప్పందం ఒకటి ఒప్పందం అని అందుకే తప్పని పరిస్థితుల్లో ఆచితూచి కొంతమేరకు విద్యుత్ ఛార్జీలు పెంచిన పాపానికి వైసీపీ పశ్చాత్తాపం పడకుండా ధర్మాలకు దిగడం ఎంతవరకు సమంజసం ఆలోచించుకోవాలన్నారు. ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆమె వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో దర్శి నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?






