దర్శి అభివృద్ధి కోసం మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసిన Dr. గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్
దర్శి అభివృద్ధి కోసం మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసిన Dr. గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్
దర్శి అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలి అని ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి డా|| గొట్టిపాటి లక్ష్మీ విన్నపం.. సానుకూల స్పందన.. ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల అమలకు ఆర్థిక నిధులు మంజూరు చేయాలని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆర్థిక శాఖ మంత్రి ని కోరడం జరిగింది.
నరసరావుపేటలో ఆదివారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ని మర్యాదపూర్వకంగా దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కలుసుకొని నియోజకవర్గ సమస్యలపై నిధులు మంజూరు చేయాలని, ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, ఆర్థిక సహకారాన్ని అందించాలని, అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. మన తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ గత ఐదేళ్లలో వైసీపీ పాలకులు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు.
మనం ఇచ్చిన హామీల్లో డ్రైవింగ్ స్కూల్ ను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆమె కోరారు. పంచాయతీగా ఉన్న దర్శి నగరపాలక పంచాయతీగా అప్డేట్ అయినప్పటికీ నియోజకవర్గ కేంద్రంగా పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామీణ రోడ్లు ప్రధాన రహదారుల అభివృద్ధికి అవసరమైన అంచనాలను అధికారుల ద్వారా పంపించడం జరిగిందని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా డిగ్రీ కాలేజీ తరగతి గదుల నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం, టీటీడీ కల్యాణ మండపానికి అవసరమైన నిధులు, సబ్ రిజిస్టార్ కార్యాలయ నిర్మాణం, మున్సిపల్ నూతన భవనాల ఏర్పాటు ఇలా వెనుకబడిన దర్శి ప్రాంతంలో అభివృద్ధి చేసి చూపించాలని అందుకు మీ సంపూర్ణ సహకారం అవసరమని మంత్రి పయ్యావుల కేశవ్ ని డాక్టర్ లక్ష్మి విన్నవించారు. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ సానుకూలంగా స్పందించి దర్శి అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు ఆర్థిక శాఖ నుండి అడ్డంకులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు డాక్టర్ లక్ష్మీ వివరించారు.
What's Your Reaction?