Ehasan Khan | అప్పుడు ధోనీ వికెట్.. ఇప్పుడు ఏకంగా ‘వంద’ క్లబ్‌లో
Ehasan Khan : పసికూన హాకాంగ్ జట్టు స్పిన్నర్ ఎహ్‌సాన్ ఖాన్(Ehasan Khan) టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన ఎహ్‌సాన్ పొట్టి ఫార్మాట్‌లో వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. మలేషియా ట్రై నేషన్ టీ20 కప్(Malaysia Tri Nation T20 Cup)లో అతడు ఈ మైలురాయికి చేరుకున్నాడు.
Ehasan Khan : పసికూన హాకాంగ్ జట్టు స్పిన్నర్ ఎహ్‌సాన్ ఖాన్(Ehasan Khan) టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన ఎహ్‌సాన్ పొట్టి ఫార్మాట్‌లో వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. మలేషియా ట్రై నేషన్ టీ20 కప్(Malaysia Tri Nation T20 Cup)లో అతడు ఈ మైలురాయికి చేరుకున్నాడు. తద్వారా తమ దేశం తరఫున టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు. ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), బాబర్ ఆజాం(Babar Azam)లను ఔట్ చేసి వార్తల్లో నిలిచిన అందరూ ఊహించినట్టు ఇప్పుడు పొట్టి క్రికెట్‌లో సంచలనంగా మారాడు.
మలేషియా ట్రై నేషన్ టీ20 కప్‌లో ఎహ్‌సన్ చెలరేగిపోతున్నాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో సోమవారం మలేషియా బ్యాటర్లను వణికించిన అతడు నాలుగు (4-0-28-4) వికెట్లతో రాణించాడు. దాంతో, టీ20ల్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఎహ్‌సాన్ విజృంభణతో హాంకాంగ్ 7 పరుగుల తేడాతో మలేషియాను ఓడించింది.
ఆరేండ్ల క్రితం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్(2018)లో ఎహ్‌సాన్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత సారథి ఎంఎస్ ధోనీని డకౌట్‌గా వెనక్కి పంపడమే కాదు రోహిత్ శర్మ వికెట్ కూడా తీసి ఔరా అనిపించాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై కూడా ఈ ఆఫ్ బ్రేకర్ సత్తా చాటాడు.
ధోనీ వికెట్ తీశాక పిచ్‌ను ముద్దాడుతున్న ఎహ్‌సాన్
బాబర్ ఆజాం, ఫఖర్ జమాన్‌లను పెవిలియన్ పంపాడు. దాంతో, ఎహ్‌షాన్ గొప్ప స్పిన్నర్ అవుతాడని విశ్లేషకులు ఊహించారు. ఇప్పటివరకూ 71 టీ20లు ఆడిన ఎహ్‌సాన్ 6.15 ఎకానమీతో 101 వికెట్లు సాధించాడు. అందులో నాలుగు పర్యాయాలు అతడు నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. అంతేకాదు వన్డేల్లో హాంకాంగ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ కూడా అతడే.
What's Your Reaction?