Cyclone: ఏపీకి 'ఫెయింజల్' తుఫాను ఎఫెక్ట్... ఆ జిల్లాలకు వరద ముప్పు
Cyclone: ఏపీకి 'ఫెయింజల్' తుఫాను ఎఫెక్ట్... ఆ జిల్లాలకు వరద ముప్పు
ఫెయింజల్ తుఫాను ఎఫెక్ట్ తో తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాన్ ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మధ్యాహ్నానికి పాండిచెరీ, తమిళనాడులోని మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశముందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది.
తుఫాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదముందని అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లవద్దని సూచించింది.
What's Your Reaction?