Gadwal | సల్కాపురంలో బ్లాస్టింగ్.. రాళ్లుపడి వలస కూలీ దుర్మరణం
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామశివారులో ఓ గుట్ట వద్ద బ్లాస్టింగ్ చేస్తున్న క్రమంలో బండరాళ్లు మీద పడి మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీ దుర్మరణం చెందాడు. సల్కాపురం గ్రామ శివారులోని గుట్టకు తవ్వకాలు నిర్వహిస్తున్నారు.
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామశివారులో ఓ గుట్ట వద్ద బ్లాస్టింగ్ చేస్తున్న క్రమంలో బండరాళ్లు మీద పడి మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీ దుర్మరణం చెందాడు. సల్కాపురం గ్రామ శివారులోని గుట్టకు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. సోమవారం బ్లాస్టింగ్ ద్వారా తవ్వకాలు చేయగా.. పేలుడు ధాటికి రాళ్లు ఎగిరివచ్చి కూలీపై పడ్డాయి. మృతుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ సింగ్ (34)గా గుర్తించారు. మృతుడు ఎక్స్‌కవేటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్లాస్టింగ్ సమయంలో క్వారీలో రాళ్లు పడడంతో మృతి చెందినట్లు తెలిపారు. భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భాగంగా చెన్నై కారిడార్‌లో భాగంగా నందిన్నె నుంచి నద్యాల వరకు 77 కిలోమీటర్ల మేర భారత్‌మాల రోడ్డు నిర్మాణ పనులను ఏవీపీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెండర్ దక్కించుకుంది.
ఇందులో భాగంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. టెండర్ దక్కించుకున్న మేఘా కంపెనీలో మధ్యప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు పని చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ కేటి మల్లేశ్ తెలిపారు. కాగా బ్లాస్టింగ్‌కు ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవని, రోడ్డు పనులు చేపడుతున్న ఏవీపీ కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ భూములు, గుట్టల నుంచి రూ.కోట్ల విలువైన పగులు రాయి, డైమండ్ సెట్మెటల్ తవ్వి రోడ్డు పనులకు వినియోగిస్తు్న్నారని, కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
What's Your Reaction?