అక్రమ రేషన్ మాఫియా పై గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ ఉక్కుపాదం...
అక్రమ రేషన్ మాఫియా పై గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ ఉక్కుపాదం...
రేషన్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టిన గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ గిద్దలూరు అర్బన్ సీఐ అక్రమ రేషన్ మాఫియా పై ఉక్కు పాదం మోపాడు దీనిపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గత కొన్ని నెలలుగా ఇష్టానుసారంగా పగలు రాత్రి తేడా లేకుండా రేషన్ మాఫియా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంత మిల్లులకు తరలిస్తున్న ఈ సమాచారం అందుకున్న పోలీసులు రేషన్ మాఫియాకి చెక్ పెట్టడానికి డేగ కన్ను తో సమయం కోసం వేచి ఉన్నారు. నిన్న రాత్రి గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లె సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని పట్టుకున్న పోలీసులు. గిద్దలూరు కొత్తకోట రేషన్ షాపుల నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు రేషన్ బియ్యాన్ని స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వాహనంలో రేషన్ షాప్ కి ప్రభుత్వం వారు ఇచ్చే సీల్ వేసి ఉన్న రేషన్ బియ్యం బస్తాలు కూడా దర్శనమిచ్చాయి పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.........
What's Your Reaction?