Govt Rice: పిడుగురాళ్ల లో గుట్టుచప్పుడు కాకుండా రేషన్ దందా...
Govt Rice: పిడుగురాళ్ల లో గుట్టుచప్పుడు కాకుండా రేషన్ దందా...
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది. పిడుగురాళ్ల లో ప్రతి నెలా ఈ అక్రమ దందా జోరుగా సాగుతున్నది.రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ర్టాలకు తరలుతున్నది. ఈ దందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. లబ్ధిదారుల నుంచి తక్కువ రేట్‌కే రావడం, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా నడుస్తున్నది.పలు రైస్‌మిల్లుల్లోనూ రీసైక్లింగ్ వ్యాపారం డీలర్ల సహకారంతో నేరుగా రేషన్ షాప్‌ల నుంచే డంపింగ్ దాడులు చేస్తున్నా కట్టడి చేయలేకపోతున్న యంత్రాంగం శాఖల మధ్య సమన్వయలోపమే కారణం.
What's Your Reaction?