Govt Rice: రాష్ట్రమంతటా విస్తరించిన బియ్యం మాఫియా.....

Govt Rice: రాష్ట్రమంతటా విస్తరించిన బియ్యం మాఫియా.....

Dec 2, 2024 - 08:49
 0  115
Govt Rice: రాష్ట్రమంతటా విస్తరించిన బియ్యం మాఫియా.....

రాష్ట్రమంతటా విస్తరించిన బియ్యం మాఫియా..... రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి :నాదెండ్ల మనోహర్.... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పిడీఎస్ బియ్యం తనిఖీలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 51 వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాం. దీనిలో 26 వేల టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించాం. సరకును సీజ్ చేసినా, దాన్ని కోర్టు నుంచి విడిపించేందుకు పెద్ద వ్యక్తుల ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి పారద్శకతతో పని చేస్తుంది. ప్రజా ధనాన్ని రక్షించాలనే బలమైన కాంక్షతో ప్రభుత్వం పని చేస్తుంది. బియ్యం మాఫియా వెనుక ఉన్న అసలు శక్తులను కచ్చితంగా బయటపెడతాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ మాఫియా విస్తరించింది. దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది, ప్రజలకు అవసరం అయిన బియ్యం వారికి చెందేలా చూస్తామన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News