ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
దర్శి:గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాటకు కట్టుబడి వందశాతం హామీలు అమలు పరిచిన సీఎం గా పేదల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఒకే ఒక్క వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సెంటర్ లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు హాజరై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు.
జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు కేక్ ను కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. బూచేపల్లి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గడియారం స్తంభం సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘననివాళ్ళు అర్పించారు. వైఎస్సార్సీపీ నియోజక వర్గ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం బారీ కేక్ ను బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, వెంకాయమ్మలు కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన ప్రతి కార్యకర్తను స్వయంగా కలసి వారికి అభినందనలు తెలిపారు. వెయ్యి మంది పైగా పేద మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బారీగా హాజరైన ప్రజలందరికీ అన్నదానం చేశారు. జగనన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులు, కార్యకకర్తలు బారీగా ప్లక్సీలు ఏర్పాటు చేశారు. కన్నుల పండువగా జరిగిన కార్యక్రమంలో జైజగన్, జై బూచేపల్లి అంటూ కార్యకర్తలు హోరెత్తించారు.
పేదల జీవితాల్లో వెలుగులు నిండాలన్నా.. మళ్ళీ జగనన్న సీఎం కావాలని చెప్పారు. ప్రభుత్వం మారిన ఆరు నెలలకే మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. జగనన్నను ఎప్పుడు గెలిపించుకోవాలా అని పేద ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తే జగనన్న గెలుపు ఖాయమని చెప్పారు. నాడు జగనన్న ప్రవేశ పెట్టిన సంక్షేమం పధకాలు నేటికి ప్రజలు మరువలేకున్నారన్నారు. జిల్లా అధ్యక్షులుగా అయిన తరువాత మొదటి సారి జగనన్న పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని ఒకే ఒక్క నాయకులు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పారు. ఐదేళ్లు ఎన్నికష్టాలు వచ్చినా దిగ్విజయంగా పధకాలు అన్నీ అమలు చేసిన గోప్పవ్యకతి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
మళ్ళీ పధకాలు అమలు కావాలంటే జగనన్న సీఎం కావాలని చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వినర్ వెన్నపూస వెంకటరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు గాలిమూటి దేవప్రసాద్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ మాజీ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీపీ సుకర సునీతా బ్రహ్మనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?