Hair Oil : రాత్రి పూట జుట్టుకు ఆయిల్ పెడుతున్నారా..?

నిజానికి జుట్టు ఆరోగ్యానికి నూనె ఎంతగానో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. అదేవిధంగా రాత్రిపూట జుట్టుకు ఆయిల్ పెట్టడం కూడా హెయిర్ సంరక్షణకు చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు. అంతేకాదు.. నైట్ టైమ్ హెయిర్ కు ఆయిల్ అప్లై చేయడం వల్ల పలు ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. సరైన పోషణ లేకపోతే చర్మం మాదిరిగానే జుట్టు కూడా డ్రైగా.. మారుతుంది. అయితే, అలాంటి సమస్య తలెత్తకుండా ఉండడంలో జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఆయిల్ పెట్టడం వల్ల కుదుళ్లకు మంచి పోషణ లభిస్తుంది. దాంతో జుట్టు హైడ్రేట్ గా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా తయారవుతుందంటున్నారు.రాత్రిపూట హెయిరక్ కు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఇస్మతుల్లా ఖాన్ పాల్గొన్నారు. నైట్ టైమ్ జుట్టుకు కొబ్బరినూనె పెట్టుకోవడం వల్ల అందులోని పోషకాలు జుట్టును ఆరోగ్యంగా, తేమగా ఉంచడానికి సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు. నైట్ టైమ్ జుట్టుకు నూనె పెట్టడం వల్ల మంచి హెయిర్ గ్రోత్ ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే, కేవలం కుదుళ్లకే కాకుండా జుట్టు చివర్లకూ ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు చివర్లు చిట్లడం, విరిగిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు. ఫలితంగా హెయిర్ మంచిగా పెరుగుతుందంటున్నారు. జుట్టుకు నైట్ టైమ్ నూనె అప్లయ్ చేయడం వల్ల కుదుళ్లకు మంచి పోషణ లభించి బలంగా, ధృడంగా, హెయిర్ సిల్కీగా మారడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. పడుకోవడానికి రెండు గంటల ముందే నూనె పెట్టుకోవడం మంచిది.

Aug 23, 2024 - 11:18
 0  8
Hair Oil : రాత్రి పూట జుట్టుకు ఆయిల్ పెడుతున్నారా..?

నిజానికి జుట్టు ఆరోగ్యానికి నూనె ఎంతగానో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. అదేవిధంగా రాత్రిపూట జుట్టుకు ఆయిల్ పెట్టడం కూడా హెయిర్ సంరక్షణకు చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు. అంతేకాదు.. నైట్ టైమ్ హెయిర్ కు ఆయిల్ అప్లై చేయడం వల్ల పలు ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.

సరైన పోషణ లేకపోతే చర్మం మాదిరిగానే జుట్టు కూడా డ్రైగా.. మారుతుంది. అయితే, అలాంటి సమస్య తలెత్తకుండా ఉండడంలో జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఆయిల్ పెట్టడం వల్ల కుదుళ్లకు మంచి పోషణ లభిస్తుంది. దాంతో జుట్టు హైడ్రేట్ గా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా తయారవుతుందంటున్నారు.

రాత్రిపూట హెయిరక్ కు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఇస్మతుల్లా ఖాన్ పాల్గొన్నారు. నైట్ టైమ్ జుట్టుకు కొబ్బరినూనె పెట్టుకోవడం వల్ల అందులోని పోషకాలు జుట్టును ఆరోగ్యంగా, తేమగా ఉంచడానికి సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

నైట్ టైమ్ జుట్టుకు నూనె పెట్టడం వల్ల మంచి హెయిర్ గ్రోత్ ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే, కేవలం కుదుళ్లకే కాకుండా జుట్టు చివర్లకూ ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు చివర్లు చిట్లడం, విరిగిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు. ఫలితంగా హెయిర్ మంచిగా పెరుగుతుందంటున్నారు. జుట్టుకు నైట్ టైమ్ నూనె అప్లయ్ చేయడం వల్ల కుదుళ్లకు మంచి పోషణ లభించి బలంగా, ధృడంగా, హెయిర్ సిల్కీగా మారడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. పడుకోవడానికి రెండు గంటల ముందే నూనె పెట్టుకోవడం మంచిది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News