భారతదేశపు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: Dr.గొట్టిపాటి లక్ష్మి-లలితసాగర్

భారతదేశపు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: Dr.గొట్టిపాటి లక్ష్మి-లలితసాగర్

Jan 26, 2025 - 12:23
 0  76
భారతదేశపు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: Dr.గొట్టిపాటి లక్ష్మి-లలితసాగర్

76 ఏళ్ల రాజ్యాంగ స్ఫూర్తి ఇంటింటికీ చేరాల్సిన సమయం: టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ *గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ భారత రాజ్యాంగంలో ఆమోదం పొంది, అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇకనైనా ఆ స్ఫూర్తి ఇంటింటికీ చేరాల్సిన సమయం ఆసన్నమైందన్నారు దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంలో అది పౌరులందరి చేతిపుస్తకంగా మార్చినప్పుడే అనుకున్న లక్ష్యసాధనకు బాటలు పడతాయని అన్నారు.

అదే స్ఫూర్తితో రాజ్యాంగానికి అనుగుణంగా, ప్రజాస్వామ్యం, పౌరహక్కుల పరిరక్షణ కేంద్రంగా రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతోందన్నారాయన. శనివారం ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో దర్శి నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. అంబేద్కర్ రాసిన ఆ రాజ్యాంగం ఉండబట్టే నియంతలు, అరాచకశక్తులకు ఎదురొడ్డి ప్రజాస్వామ్యం మనగలుగుతోందన్నారు. గడిచిన అయిదేళ్లు రాష్ట్రంలో పరిస్థితులు కూడా అందుకు నిదర్శనంగా తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు లభించి, అందరూ సమానంగా జీవించాలని కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుందామని పిలుపునిచ్చారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News