దర్శి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు...Dr.గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్
దర్శి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు...Dr.గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్
రాష్ట్ర ప్రజలకు, దర్శి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు:- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతుంది తెలుగుదనాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను లోకమంతా చాటేలా సంక్రాంతి వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో అద్భుతమైన ప్రారంభాలకు నాంది పలకాలని, ప్రతీ కుటుంబంలో ఆనందం, ప్రేమ వెల్లివిరియాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికి, దర్శి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలతో భోగిని, సిరి సంపదలతో సంక్రాంతిని, కనువిందుగా కనుమని జరుపుకోవాలని డాక్టర్ లక్ష్మి ఆకాంక్షించారు.. కష్టాలను దహించే భోగి మంటలు, ధాన్యపు రాసులతో నిండిన గదులు, ఇంటి ముంగిట కళకళలాడే అందమైన రంగవల్లులు, చిన్నారుల చిరునవ్వులు, పిండి వంటల గుమగుమలు, బంధుమిత్రుల సందళ్లు, బసవన్నల ఆటపాటలతో సంక్రాంతిని ఆనందోత్సాహాల నడుమ అంగరంగ వైభవంగా జరుపుకోవాలన్నారు.
What's Your Reaction?