Hayathnagar: నా కోరిక తీరిస్తే నీ భర్తతో.... మహిళపై ఎస్ఐ వేధింపులు
Hayathnagar: నా కోరిక తీరిస్తే నీ భర్తతో.... మహిళపై ఎస్ఐ వేధింపులు
భర్త వేధిస్తున్నాడని న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ మహిళకు ఎస్ఐ రూపంలో మరిన్ని వేధింపులు ఎదురైన సంఘటన హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. Hayathnagar: నా కోరిక తీరిస్తే నీ భర్తతో.... మహిళపై ఎస్ఐ వేధింపులు. భర్త వేధింపులపై ఫిర్యాదు చేయడానికి బాధిత మహిళ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. స్టేషన్ ఎస్ఐ సైదులు ఆమె సమస్యను అవకాశంగా తీసుకుని 'నీ భర్తపై కేసు నమోదు చేయాలంటే నా కోరిక తీర్చాలంటూ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. మహిళ తన ఫిర్యాదులో భాగంగా ఇచ్చిన ఆమె ఫోన్ నెంబర్ కు తరచూ ఎస్ఐ సైదులు ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు.'నీ కేసు నేను పరిష్కరిస్తానని అయితే మీ ఇంటికి వస్తానని, నా కోరిక తీర్చాలంటూ ఎస్ఐ ఫోన్లు చేశాడు. ఎస్ఐ వేధింపులను తట్టుకోలేని బాధిత మహిళ ధైర్యం చేసి పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఎస్సై సైదులుపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేసింది. దీంతో కమిషనర్ సుధీర్ బాబు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
What's Your Reaction?