తెలంగాణలో హై అలర్ట్! పోలీసుల తనిఖీలు ముమ్మరం...
తెలంగాణలో హై అలర్ట్! పోలీసుల తనిఖీలు ముమ్మరం...

హైదరాబాద్:ఏప్రిల్ 24 పహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో తెలంగాణలో హై అలర్ట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల అవకాశాలపై వచ్చిన విశ్వా సనీయ సమాచారంతో రాష్ట్ర పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని హెచ్ఐసిసి సైబరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో కఠినమైన భద్రత చర్యలు చేపట్టాయి.
తెలంగాణ ముఖ్య రాష్ట్ర కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర పోలీస్ యంత్రాంగా న్ని అలర్ట్ చేసారు. రాష్ట్ర రాజధాని హైదరా బాద్ లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానా స్పద వ్యక్తులను అదుపు లోకి తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ సహ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రా లన్నిటికీ గురువారం కేంద్ర నిఘా వర్గాలు ఈ హెచ్చ రికలు జారీ చేశాయి.అన్ని రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఈ మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో, దేశ సరిహద్దుల్లో అదనపు భద్రతా బలగాలు మోహరించాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ముంచుకు రావొచ్చునేమో అనే అనుమానాలు ఇరు దేశాల్లోనూ వ్యాపించాయి.
What's Your Reaction?






