HMPV Virus: చైనాలో భయంకరమైన కొత్త వైరస్... భారత దేశం పై ప్రభావం ఉంటుందా ?
HMPV Virus: చైనాలో భయంకరమైన కొత్త వైరస్... భారత దేశం పై ప్రభావం ఉంటుందా ?
China New Virus HMPV Full Details: కొత్త కొత్త వైరస్‌లకు, రోగాలకు జన్మస్థానమైన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ లాంటిదే మరో వైరస్ చైనాలో వ్యాపిస్తోంది. కరోనాలాగే ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ, జనాలను ఆస్పత్రులకు పరుగులు పెట్టిస్తోంది. కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలే కనిపిస్తుండటం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది.
కొత్త వైరస్ లక్షణాలు ఈ కొత్త వైరస్ పేరు HMPV(హ్యుమన్ మెటానియా వైరస్). దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే దీంట్లోనూ ఉంటున్నాయి. ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరోనా లాగే గాలి ద్వారా వ్యాపించగలదు. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తల నొప్పి లక్షణాలు ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. న్యుమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.
What's Your Reaction?