HYDRA : దమ్ముంటే ఒవైసి అక్రమ నిర్మాణాలు కూల్చాలి.. బీజేపీ ఏలేటి సవాల్
కొంత మంది టార్గెట్ గానే హైడ్రా పని చేస్తుందనే అనుమానం వస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేకనే ఆ వైఫల్యాలను ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా ను తెర మీదకి తెచ్చారని మండిపడ్డారు. దమ్ముంటే పాత బస్తీలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాలని సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉన్న చెరువులు ఎన్ని? ఆక్రమణకు గురైన చెరువులు ఎన్ని? అన్యాక్రాంతం అయిన భూములు ఎన్ని..? పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సల్కం చెరువులో ఉన్న ఒవైసీ భూములను కూల్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఆ భూములు హైడ్రా కమిషనర్ కనిపించకుంటే తాను వచ్చి చూపిస్తానని వ్యాఖ్యానించారు. ఓల్డ్ సిటీ గుర్రం చెరువు, జల్ పల్లి చెరువు ఆక్రమణల వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద లేకుంటే తాను సమర్పిస్తానని చెప్పారు. ఓల్డ్ సిటీ లో ఇష్టానుసారంగా చెరువు గుట్టలను కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలేటి. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే హైడ్రా కూల్చివేతలను ఓల్డ్ సిటీ నుంచి ప్రారంభించి, ఒవైసీ చెరలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
కొంత మంది టార్గెట్ గానే హైడ్రా పని చేస్తుందనే అనుమానం వస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేకనే ఆ వైఫల్యాలను ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా ను తెర మీదకి తెచ్చారని మండిపడ్డారు. దమ్ముంటే పాత బస్తీలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాలని సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ఉన్న చెరువులు ఎన్ని? ఆక్రమణకు గురైన చెరువులు ఎన్ని? అన్యాక్రాంతం అయిన భూములు ఎన్ని..? పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సల్కం చెరువులో ఉన్న ఒవైసీ భూములను కూల్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఆ భూములు హైడ్రా కమిషనర్ కనిపించకుంటే తాను వచ్చి చూపిస్తానని వ్యాఖ్యానించారు. ఓల్డ్ సిటీ గుర్రం చెరువు, జల్ పల్లి చెరువు ఆక్రమణల వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద లేకుంటే తాను సమర్పిస్తానని చెప్పారు.
ఓల్డ్ సిటీ లో ఇష్టానుసారంగా చెరువు గుట్టలను కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలేటి. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే హైడ్రా కూల్చివేతలను ఓల్డ్ సిటీ నుంచి ప్రారంభించి, ఒవైసీ చెరలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
What's Your Reaction?