HYDRA : హైడ్రా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు
హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయానికి మధ్యాహ్నం తర్వాత పెద్ద సంఖ్యలో ఫిర్యాదు దారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు క్యూ కడుతున్నారు. దీంతో హైడ్రా కార్యాలయానికి రోజు రోజుకీ తాకిడి పెరుగుతోంది. మొదట్లో పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు.. హైడ్రా కఠిన చర్యలతో వందల్లోకి చేరాయి. వాటన్నింటినీ స్వీకరిస్తున్న కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు.

What's Your Reaction?