Hydra : హైడ్రా భవిష్యత్తు ప్రణాళికపై ఉత్కంఠ

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన ఆందోళన... మిగిలిన ఆక్రమణలు కూల్చేస్తారా.. ?

Aug 29, 2024 - 08:09
 0  3
Hydra : హైడ్రా భవిష్యత్తు ప్రణాళికపై ఉత్కంఠ

హైడ్రా’ ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసింది. హైకోర్టు నుంచి హీరో నాగార్జున స్టే తెచ్చుకునేలోపే పూర్తిగా ధ్వంసం చేసింది. ఇదే వేగంతో హైడ్రా దూకుడు పెంచింది. అయితే కూల్చినంత మాత్రాన అయిపోలేదని.. ఆ స్థలం యజమాని పేరుపై రిజిస్ట్రార్ అయి ఉంటుందని, దీన్ని స్వాధీన పరుచుకోవడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు.

మాదాపూర్‌, జూబ్లీహిల్స్, కొండాపూర్, కోకాపేట్ సిటీలో అత్యంత విలువ‌గ‌ల భూముల‌న్న ప్రాంతాలు. ఎన్ క‌న్వెన్ష‌న్ ఉన్న‌ద‌క్క‌డే. దాదాపు 10 ఎక‌రాల మేర హీరో నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్‌ను దశాబ్దం కింద నిర్మించాడు. దీని విలువ బ‌హిరంగ మార్కెట్లో దాదాపు 1500 కోట్ల పై మాటే. ఎన్ క‌న్వెన్ష‌న్ హైదరాబాద్లో పేరు ఉన్న ఫంక్ష‌న్ హాల్‌. పేరుకు ఒక్క క‌న్వెన్ష‌న్ సెంట‌రే. కానీ ఇందులో నాలుగు హాళ్లు ఉన్నాయి. ఒక్కో హాల్ నెల ఖ‌ర్చులు పోను కోటి రూపాయ‌ల ఆదాయం స‌మ‌కూర్చి పెడుతుంది. ఇప్పటి వరకు ఎంత ఆదాయం సమకూరి ఉంటుందో అర్థం చేసుకోగలం. ఇదిప్పుడు నేల‌కూలింది. అయితే ప్రస్తుతం ఈ 1500 కోట్ల ఆస్తి ఎవ‌రికి ద‌క్కుతుంది. ప్రభుత్వ పరం అవుతుందా? లేక చెరువును ఆక్రమించి నిర్మించారు కాబట్టి చెరువులోనే కలుపుతారా అన్నది కాలమే చెబుతుంది.

భూమిని స్వాధీనం చేసుకోవడం సాధ్యమమేనా?

ఎన్ కన్వెన్షన్ భూమిని స్వాధీనం చేసుకోవడం క‌చ్చితంగా స‌ర్కార్‌కు ఏ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది ప‌క్కాగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్న స్థ‌లం. క‌ట్డడ‌మైతే కూల్చారు. ఆదాయానికి గండికొట్టారు. కానీ ఆ ప‌దెక‌రాల ల్యాండ్‌ను మాత్రం లాక్కోవ‌డం స‌ర్కార్‌కు సాధ్యంకానిప‌నేన‌ని నిపుణులు చెబుతున్నారు. కోకాపేట్‌లో గ‌వ‌ర్న‌మెంట్ 100 కోట్లకు ఒక ఎక‌రం అమ్ముకున్న‌ది. ఆ త‌రువాత అత్యంత ధ‌ర ప‌లికేది ఈ భూములకే. ఎక‌రాకు 150 కోట్ల విలువ ఉంటుందిక్క‌డ‌. అలా ప‌దెక‌రాల ప‌రిధి ఎన్ క‌న్వెన్ష‌న్‌ది. మ‌రి ఈ 1500 కోట్ల ఆస్తిని స‌ర్కార్ కైవసం చేసుకుంటుందా..? అనే చ‌ర్చ ఉంది. కానీ ఇది సాధ్య‌మ‌య్యేప‌ని కాదు. నిర్మాణాలు చేయ‌క‌పోతే చాలు. ఆ ల్యాండ్‌ను నిర్మాణేత‌ర ప‌నుల‌కు వాడుకోవ‌చ్చు. లేదా యాజ‌మానే అమ్ముకోవ‌చ్చు. ఈ లెక్క‌న అక్క‌డ ఆదాయ వ‌న‌రులను, ఫామ్‌హౌజ్‌ల పేరిట జ‌రిగిన విలాస‌వంత‌మైన జీవితం కోసమై వెలిసిన క‌ట్ట‌డాల‌ను మాత్రమే నేల‌మ‌ట్టం చేయ‌గ‌ల‌దు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News