HYDRA: హీరో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత

పటిష్ట బందోబస్తు మధ్య మాదాపూర్‌లోని సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత

Aug 24, 2024 - 12:28
 0  1
HYDRA: హీరో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత

చెరువుల్లో, నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తెలంగాణ ప్రభుత్వం కూల్చివేస్తోంది. మాదాపూర్‌లోని సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు. తుమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి ఎన్‌ కన్వెన్షన్‌ను నిర్మించారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్‌ నిర్మించారని హైడ్రాకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కూల్చివేతలు ప్రారంభించారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత ప్రారంభించారు.

హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. అయితే రియ‌ల్ ఎస్టేట్ ప్లాట్ల దందా, లేక‌పోతే ఫామ్‌హౌజ్‌ల నిర్మాణాలు. అన్ని పార్టీల నేత‌ల తీరు ఇదే. ఇప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటున్నారు. అది నాది కాదు.. నా దోస్తుదంటున్నారు. నాది స‌క్రమ‌మే నీదే అక్రమ‌మంటున్నారు. ఫ‌స్టు నీ ఫామ్‌హౌజ్ కూల్చాల‌ని ఒక‌రు, మొదలు నీదే కూల్చాల‌ని ఇంకొక‌రు ఇలా మాట‌లతో టైం పాస్ చేస్తున్నారు. కౌంట‌ర్లిచ్చుకుంటూ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. కేటీఆర్‌, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, కేవీపీ, గ‌డ్డం వివేక్‌, మ‌ధుయాష్కీ, ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డిల ఫామ్‌హౌజ్‌ల‌న్నీ అక్ర‌మంగా నిర్మించిన‌వే అన్న ఆరోపణలు ఉన్నాయి.

హైదరాబాద్‌ సమీపంలోని అమీన్ పూర్, పటాన్ చెరు మండలాల్లో చెరువుల చుట్టూ వెలసిన కాలనీలు, ఎఫ్డీఎల్ పరిధిలోకి వచ్చే ప్లాట్లు, ఆక్రమణలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో అమీన్ పూర్ మండలం, మున్సిపాలిటీలోని ఒకటి రెండు చెరువులు, నాళాలు ఆక్రమణకు గురైనట్టు డ్రోన్ కెమెరాతో సర్వే చేసి గుర్తించింది. పైగా ఇటీవల రెండుసార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్ పూర్ లోని పలు చెరువులను సందర్శించి సమగ్ర నివేదికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో గతంలో సర్వే నిర్వహించగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. దీంతో కొంతమంది ఆక్రమణదారులు ఆందోళనపడుతూ న్యాయనిపుణుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News