మీ చిట్టా నా దగ్గర ఉంది..ఎవ్వరిని వదలను - టీడీపీ ఎమ్యెల్యే భూమా అఖిలప్రియ మాస్ వార్నింగ్
మీ చిట్టా నా దగ్గర ఉంది..ఎవ్వరిని వదలను - టీడీపీ ఎమ్యెల్యే భూమా అఖిలప్రియ మాస్ వార్నింగ్
తనపై ప్రత్యర్థులు అనేక తప్పుడు కేసులు నమోదు చేసి మానసికంగా హింసించారన్నారు. తన దగ్గర ఒక రెడ్ బుక్ ఉందని, అందులో తనను ఇబ్బందులకు గురి చేసినవారి పేర్లు రాశానని అన్నారు. మీ చిట్టా నా దగ్గర ఉంది..ఎవ్వరిని వదలను - టీడీపీ ఎమ్యెల్యే భూమా అఖిలప్రియ మాస్ వార్నింగ్ఇప్పుడు తాము మాత్రం ఎందుకు వదులుతామని, ఎవ్వరినీ వదిలి పెట్టమని తన ప్రత్యర్థుల మీద సీరియస్ అయ్యారు. ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తానని అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మీ తోలు తీస్తానని చెప్పానని.. ఎవ్వరినీ వదిలి పెట్టనని తన ప్రత్యర్థుల మీద సీరియస్ అయ్యారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అనేక తప్పుడు కేసులు నమోదు చేసి మమ్మల్ని మానసికంగా హింసించారని, ఇప్పుడు తాము మాత్రం ఎందుకు వదులుతామని, ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తానని అఖిలప్రియ అన్నారు. మీరంతా ఇక నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిదని అఖిలప్రియ తన ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఏపీకి చెందిన టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ.. 2014లో ఆళ్లగడ్డ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, చంద్రబాబు ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.
మూడు రోజుల కిందట ఆళ్లగడ్డ గవర్నమెంట్ కాలేజీని ఎమ్మెల్యే అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్ర రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. డిగ్రీ కాలేజీ తీసుకువచ్చానని బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకుంటున్నారని.. కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేవని విమర్శించారు. టాయిలెట్స్ కూడా సరిగా లేవని… స్వీపర్స్ చేయాల్సిన పనులు కూడా విద్యార్థులే చేసుకుంటున్నారని చెప్పారు. పాత బిల్డింగ్ ను ఎంపిక చేసి డిగ్రీ కాలేజీ తెచ్చామని గొప్పలు చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు.
చర్చకు సిద్ధమా..?
“గంగుల బిజేంద్రారెడ్డి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. నువ్వు కేవలం ఓటరువి మాత్రమే. ఓటర్ అంటే దొంగ ఓటర్ వి. నన్ను విమర్శించే అంత స్థాయి నీది కాదు. ఎక్కడో సస్పెండ్ అయి మతిస్థిమితం సరిగా లేని ప్రిన్సిపాల్ ని ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తును నాశనం చేశావు. ఆళ్లగడ్డకు హాస్పిటల్ తెచ్చాను ఊరికే చెప్పడం కాదు కనీసం కాలేజీ బిల్డింగ్ కట్టించావా..?” అని అఖిలప్రియా ప్రశ్నించారు. ఆళ్లగడ్డలో ఏదో ప్రెస్ మీట్ లు పెట్టి నీచ రాజకీయాలు చేస్తే సహించేదే లేదని అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. “ఇప్పుడు నేను చెప్తున్నా గంగుల బిజెంద్రా రెడ్డి… నీకు దమ్ముంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం. మున్సిపల్ ఆఫీస్ లోనే పెట్టిద్దాం. నేనేదో వసూళ్లు చేస్తున్నానని ఆరోపిస్తున్నావ్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలి. మీడియా సాక్షిగానే అన్ని విషయాలపై మాట్లాడుదాం” అని సవాల్ విసిరారు.
What's Your Reaction?