IKEA : వచ్చే ఏడాదిలోన ఐకియా డెలివరీలన్నీ ఈవీలతోనే!
తమ ఉత్పత్తుల డెలివరీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలతోనే నిర్వహిస్తామని స్వీడిష్ హోం ఫర్నిషింగ్ దిగ్గజం ఐకియా వెల్లడించింది. ఈ దిశగా 2025 నాటికి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపింది. 2018లో భారత్ లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, పూణె నగరాల్లో జీరో కార్బన్ డెలివరీలలో 100 శాతం లక్ష్యాన్ని సాధించింది. ప్రస్తుతం దేశవ్యాప్త డెలివరీలలో 88శాతం ఈవీలతోనే జరుగుతున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్, పూణె, బెంగళూరు, గుజరాత్, ముంబై నగరాల్లో 100 ఈవీ వాహనాలను మోహరించినట్లు కంట్రీ కస్టమర్ ఫుల్ ఫిల్మెంట్ మేనేజర్ సైబా సూరి తెలిపారు. డెలివరీల కోసం మొదటిసారిగా 2019లో ఎలక్ట్రిక్ వాహనాల్ని ఐకీయా ప్రవేశపెట్టింది. ఢిల్లీ-ఎన్సీఆర్ లో వచ్చే ఏడాది ఈవీల ద్వారా డెలివరీలు చేపడతామని తెలిపింది.
తమ ఉత్పత్తుల డెలివరీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలతోనే నిర్వహిస్తామని స్వీడిష్ హోం ఫర్నిషింగ్ దిగ్గజం ఐకియా వెల్లడించింది. ఈ దిశగా 2025 నాటికి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపింది. 2018లో భారత్ లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, పూణె నగరాల్లో జీరో కార్బన్ డెలివరీలలో 100 శాతం లక్ష్యాన్ని సాధించింది.
ప్రస్తుతం దేశవ్యాప్త డెలివరీలలో 88శాతం ఈవీలతోనే జరుగుతున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్, పూణె, బెంగళూరు, గుజరాత్, ముంబై నగరాల్లో 100 ఈవీ వాహనాలను మోహరించినట్లు కంట్రీ కస్టమర్ ఫుల్ ఫిల్మెంట్ మేనేజర్ సైబా సూరి తెలిపారు. డెలివరీల కోసం మొదటిసారిగా 2019లో ఎలక్ట్రిక్ వాహనాల్ని ఐకీయా ప్రవేశపెట్టింది. ఢిల్లీ-ఎన్సీఆర్ లో వచ్చే ఏడాది ఈవీల ద్వారా డెలివరీలు చేపడతామని తెలిపింది.
What's Your Reaction?