India Women Squad : మహిళల టీ20 కప్.. భారత టీమ్ ఇదే

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం 15 మంది ప్లేయర్లతో కూడిన భారత టీమ్ ను బీసీసీఐ ప్రకటించింది.హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా, ఓపెనర్‌ స్మృతి మంధానను వైస్‌ కెప్టెన్‌గా కొనసాగించారు. వికెట్‌ కీపర్‌ యాస్తికా భాటియా, ఆల్‌రౌండర్‌ శ్రేయంకా పాటిల్‌ను ఫిట్‌నెస్‌ సాధిస్తే జట్టుతోపాటు యూఏఈకి వెళ్తారు. ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, సైమా ఠాకూర్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు. టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ, అక్కడ అధికార మార్పిడి నేపథ్యంలో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు చేరతాయి. గ్రూప్‌ ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌, శ్రీలంక.. గ్రూప్‌ బిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.భారత్‌ అక్టోబర్ 4న న్యూజిలాండ్‌, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న దుబాయ్‌లో జరగనుంది. అక్టోబర్ 17, 18న నిర్వహించే సెమీ ఫైనల్స్‌తోపాటు అదే 20న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. భారత టీమ్: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పుజా వస్త్రాకర్‌, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, సంజనా సంజీవన్.

Aug 28, 2024 - 23:33
 0  2
India Women Squad : మహిళల టీ20 కప్.. భారత టీమ్ ఇదే

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం 15 మంది ప్లేయర్లతో కూడిన భారత టీమ్ ను బీసీసీఐ ప్రకటించింది.హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా, ఓపెనర్‌ స్మృతి మంధానను వైస్‌ కెప్టెన్‌గా కొనసాగించారు. వికెట్‌ కీపర్‌ యాస్తికా భాటియా, ఆల్‌రౌండర్‌ శ్రేయంకా పాటిల్‌ను ఫిట్‌నెస్‌ సాధిస్తే జట్టుతోపాటు యూఏఈకి వెళ్తారు. ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, సైమా ఠాకూర్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు. టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ, అక్కడ అధికార మార్పిడి నేపథ్యంలో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు చేరతాయి. గ్రూప్‌ ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌, శ్రీలంక.. గ్రూప్‌ బిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.భారత్‌ అక్టోబర్ 4న న్యూజిలాండ్‌, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న దుబాయ్‌లో జరగనుంది. అక్టోబర్ 17, 18న నిర్వహించే సెమీ ఫైనల్స్‌తోపాటు అదే 20న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది.

భారత టీమ్: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పుజా వస్త్రాకర్‌, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, సంజనా సంజీవన్.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News