Indra Re-Release : పక్కా కమర్షియల్ మూవీ ‘ఇంద్ర’

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 22 ఏండ్ల కిందట వచ్చిన ‘ఇంద్ర’ మూవీ టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. చిరంజీవి నటించిన తొలి, చివరి ఫ్యాక్షన్ మూవీ ఇదే. ఈ నెల 22న చిరు బర్త్ డే సందర్భంగా ఇంద్ర మూవీ రీరిలీజ్ కానుంది.దీనిపై చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ‘ఇంద్రసేనా రెడ్డి.. అని అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ సినిమాకు ఉన్న పవర్‌ అలాంటిది. ‘ఇంద్ర’ అంత పెద్ద సక్సెస్‌ కావడానికి ప్రధాన కారణం దాని స్టోరీ. అందుకే ఇప్పటికీ ఆ సినిమాను గుర్తుపెట్టుకున్నారు. మాట్లాడుకుంటున్నారు. ఏ సీన్‌ నుంచి చూడడం మొదలుపెట్టినా చివరిదాకా చూస్తాం. అదే ఆ స్టోరీకి ఉన్న గొప్పతనం. నా సినిమాల్లో అత్యంత టెక్నికల్ వాల్యూస్ ఉన్న బెస్ట్ కమర్షియల్ మూవీ ఇదే. ఎలాంటి డౌట్​ లేదు. కథ, స్క్రీన్‌ప్లే, ఆర్టిస్టుల నటన, పాటలు.. అన్నీ అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్‌ చిత్రానికి కచ్చితమైన ఉదాహరణ ‘ఇంద్ర’. డైరెక్టర్‌ బి.గోపాల్‌ దీన్ని గొప్పగా తీశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు. 2002 జులై 22 ‘ఇంద్ర’ రిలీజ్‌ సందర్భంగా ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో.. ఇప్పుడు అలానే ఉన్నా. ఈతరం వాళ్లకు దీన్ని బిగ్‌ స్క్రీన్‌పై చూపించాలనే ఆలోచన వచ్చిన స్వప్నదత్‌, ప్రియాంక దత్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను’ అని చిరు ఆ వీడియోలో పేర్కొన్నారు.

Aug 23, 2024 - 11:18
 0  2

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News