Indra Re-Release Record : మెగాస్టార్ ఇంద్ర రికార్డ్ .. అన్ని థియేటర్ లలో రీరిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఇంద్ర రీ రిలీజ్ రికార్డు సృష్టించింది. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ను రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ సినిమా రీ రిలీజ్ అయ్యింది. 385కు పైగా థియేటర్లలో విడుదలై.. ది బిగ్గెస్ట్ ఎవర్ రీ రిలీజ్ సినిమాగా కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటిదాకా ఏ హీరో సినిమా రీ రిలీజ్ ఇన్ని థియేటర్స్ లో కాలేదు. దీంతో చిరంజీవి మరో రికార్డ్ సెట్ చేసాడు. ఇక రీ రిలీజ్ కలెక్షన్స్ లో కూడా ఇంద్ర సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. 2002 జూలై 24న రిలీజ్ అయిన 'ఇంద్ర' ఓ సంచలనం. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది 'ఇంద్ర.22 కేంద్రాల్లో 100 రోజులు, 35 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన 'ఇంద్ర' సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు గ్రాస్ ను కొల్లగొట్టిన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమాకు బీ గోపాల్ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ సరసన హీరోయిన్ గా సోనాలి బింద్రే నటించింది

What's Your Reaction?