Infosys : ఫ్రెషర్ల రిక్రూట్ మెంట్ కోసం ఇన్ఫొసిస్ పవర్
ఫ్రెషర్స్ రిక్రూట్ మెంట్ కోసం ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫొసిస్ ‘పవర్’ పేరుతో కొత్త ప్రోగ్రామ్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం దీన్ని రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పవర్ కింద సెలక్ట్ అయిన వారికి రూ.9 లక్షల వరకు యాన్యువల్ ప్యాకేజీ ఉంటుందని వెల్లడించాయి.సాధారణంగా ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు ఏడాదికి రూ.3-3.5 లక్షల జీతం ఇస్తుంటుంది. అయితే, కొత్తగా తీసుకురాబోయే పవర్ ప్రోగ్రామ్ లో కోడింగ్, సాఫ్ట్‌వేర్‌లో సవాళ్లు, ప్రోగ్రామింగ్ వంటి నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఆయా రంగాల్లో వారి నైపుణ్యాన్ని పరీక్షించిన తర్వాతే ఎంపిక చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయని.. శాలరీ రూ.4-6.5 లక్షల నుంచి ప్రారంభమై రూ.9 లక్షల వరకు ఆఫర్ చేస్తామని తెలిపాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సైతం గతేడాది ‘ప్రైమ్’ పేరుతో ఇదేతరహా రిక్రూట్ మెంట్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. దీనికింద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొఫైల్స్‌లో ఎంపికైన వారికి ఏడాదికి రూ.9-11 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
![Infosys : ఫ్రెషర్ల రిక్రూట్ మెంట్ కోసం ఇన్ఫొసిస్ పవర్](https://www.rmblivenews.com/uploads/images/202408/image_870x_66c822e8e0d2d.jpg)
![](https://www.tv5news.in/h-upload/2024/08/21/1339194-infosys.webp)
ఫ్రెషర్స్ రిక్రూట్ మెంట్ కోసం ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫొసిస్ ‘పవర్’ పేరుతో కొత్త ప్రోగ్రామ్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం దీన్ని రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పవర్ కింద సెలక్ట్ అయిన వారికి రూ.9 లక్షల వరకు యాన్యువల్ ప్యాకేజీ ఉంటుందని వెల్లడించాయి.సాధారణంగా ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు ఏడాదికి రూ.3-3.5 లక్షల జీతం ఇస్తుంటుంది. అయితే, కొత్తగా తీసుకురాబోయే పవర్ ప్రోగ్రామ్ లో కోడింగ్, సాఫ్ట్‌వేర్‌లో సవాళ్లు, ప్రోగ్రామింగ్ వంటి నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఆయా రంగాల్లో వారి నైపుణ్యాన్ని పరీక్షించిన తర్వాతే ఎంపిక చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయని.. శాలరీ రూ.4-6.5 లక్షల నుంచి ప్రారంభమై రూ.9 లక్షల వరకు ఆఫర్ చేస్తామని తెలిపాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సైతం గతేడాది ‘ప్రైమ్’ పేరుతో ఇదేతరహా రిక్రూట్ మెంట్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. దీనికింద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొఫైల్స్‌లో ఎంపికైన వారికి ఏడాదికి రూ.9-11 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
What's Your Reaction?
![like](https://www.rmblivenews.com/assets/img/reactions/like.png)
![dislike](https://www.rmblivenews.com/assets/img/reactions/dislike.png)
![love](https://www.rmblivenews.com/assets/img/reactions/love.png)
![funny](https://www.rmblivenews.com/assets/img/reactions/funny.png)
![angry](https://www.rmblivenews.com/assets/img/reactions/angry.png)
![sad](https://www.rmblivenews.com/assets/img/reactions/sad.png)
![wow](https://www.rmblivenews.com/assets/img/reactions/wow.png)