Infosys | తేదీల్లో మార్పులే.. వారిని చేర్చుకుంటాం.. 2022 ఫ్రెషర్స్ ఆన్ బోర్డింగ్‌పై ఇన్ఫోసిస్ సీఈఓ వ్యాఖ్య
Infosys | తేదీల్లో మార్పులు తప్ప 2022లో తాము ఆఫర్ లెటర్లు ఇచ్చిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తప్పక ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ చెప్పారు.
Infosys | కొత్త గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన జాబ్ ఆఫర్లను గౌరవిస్తామని, వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ చెప్పారు. తేదీల్లో కొన్ని సర్దుబాట్లు తప్ప జాబ్ ఆఫర్లు అందుకున్న వారిని ఆన్ బోర్డింగ్ లోకి తీసుకుంటామని తెలిపారు. 2022 బ్యాచ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు 2000 మందికి జాబ్ ఆఫర్లు ఇచ్చినా.. ఆన్ బోర్డింగ్ జాప్యం అవుతున్న నేపథ్యంలో సలీల్ పరేఖ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘ఇంతకుముందు మేం జాబ్ ఆఫర్ ఇచ్చాం. ఆ ఆఫర్ల ప్రకారం వారు మా కంపెనీలో చేరతారు. మేం కొన్ని తేదీలు మార్చామే కానీ, ప్రతి ఒక్కరిని ఉద్యోగంలోకి తీసుకుంటాం. మా వైఖరిలో ఎటువంటి మార్పు లేదు’ అని రెండేండ్ల క్రితం తీసుకున్న 2000 మంది ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకంపై పీటీఐకి సలీల్ పరేఖ్ చెప్పారు. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్’లో 3,15,332 మంది ఉద్యోగులు ఉన్నారు.
2022-23 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ రోల్స్ నిర్వహణకు ఇన్ఫోసిస్ 2000 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకున్నది. కానీ, వారిని ఆన్ బోర్డింగ్ లోకి తీసుకోవడంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ఇన్ఫోసిస్ కు వ్యతిరేకంగా కార్మికశాఖకు ఐటీ అండ్ ఐటీఈఎస్ యూనియన్ నాస్కంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ (ఎన్ఐటీఈఎస్) ఫిర్యాదు చేసింది. ఈ గ్రాడ్యుయేట్లకు 2022 ఏప్రిల్‌లో ఆఫర్ లెటర్లు ఇచ్చిన ఇన్ఫోసిస్.. వారిని ఆన్ బోర్డింగ్ లోకి తీసుకోవడంలో నిరంతరం జాప్యం అవుతున్నదని ఎన్ఐటీఈఎస్ పేర్కొంది. వారికి అన్ పెయిడ్ ప్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అనూహ్య అదనపు అంచనాలతో జాప్యం చేస్తున్నదని తెలిపింది. యాజమాన్యం అవసరాలన్నీ పూర్తి చేసినా వీరిని త్రిశంకు స్వర్గంలో నిలిపేసిందని వ్యాఖ్యానించింది.
What's Your Reaction?