Israel : ఇజ్రాయెల్, హెజ్ బొల్లా మధ్య భీకర యుద్ధ దాడులు..
పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. దక్షిణ లెబనాన్‌పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా.. ప్రతిగా హెజ్‌బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్‌తోపాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. ఒకవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్టు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. కొన్ని నెలలుగా స్వల్ప స్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాలు ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగడంతో.. పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధానికి ఈ దాడులు ఆజ్యం పోస్తాయని తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇరు వర్గాలు ప్రకటించాయి. లెబనాన్‌పై చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లు వివరించింది. ఉత్తర, మధ్య ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై హెజ్‌బొల్లా దాడులు చేసిందని, స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి నాదవ్ శోషానీ తెలిపారు.
పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. దక్షిణ లెబనాన్‌పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా.. ప్రతిగా హెజ్‌బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది.
దాడులతో ఇరాన్‌తోపాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. ఒకవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్టు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. కొన్ని నెలలుగా స్వల్ప స్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాలు ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగడంతో.. పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధానికి ఈ దాడులు ఆజ్యం పోస్తాయని తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.
సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇరు వర్గాలు ప్రకటించాయి. లెబనాన్‌పై చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లు వివరించింది. ఉత్తర, మధ్య ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై హెజ్‌బొల్లా దాడులు చేసిందని, స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి నాదవ్ శోషానీ తెలిపారు.
What's Your Reaction?