దర్శి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి ఐటీ మంత్రి నారా లోకేష్ అంగీకారం
దర్శి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి ఐటీ మంత్రి నారా లోకేష్ అంగీకారం
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ విన్నపానికి మంత్రి లోకేష్ సానుకూలత దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి ఐటీ మంత్రి నారా లోకేష్ అంగీకారం మంత్రి లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ లక్ష్మి నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణంలో డిగ్రీ కాలేజీ అవసరం ఎంతైనా ఉందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ కి విన్నవించడం జరిగింది. ఉండవల్లిలో సోమవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు పలు అంశాలపై లోకేష్ తో సుదీర్ఘంగా అరగంట పాటు చర్చించారు.
ఆనాడు యువగళం పాదయాత్రలో మనం ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కురిచేడు రోడ్ లో డిగ్రీ కాలేజీకి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆరు ఎకరాలు కేటాయించామని తెలియజేశారు. గత వైసిపి హయంలో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో డిగ్రీ కాలేజీ అవసరాన్ని వివరించారు. వెనుకబడిన ప్రాంతం ఐదు మండలాలలో జూనియర్ కాలేజీ లతో ఉన్న ఈ ప్రాంతానికి ఉన్నత విద్య డిగ్రీ సాంకేతిక విద్యలో లేకపోవడం వల్ల ఒంగోలు ఇతర ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వివరించారు. దీనిపై ఐటీ శాఖ మాత్యులు లోకేష్ సానుకూలంగా స్పందించి వెంటనే అంచనాలు రూపొందించి పంపించాలని, త్వరలో దర్శి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కాలేజీ కళ నెరవేరుస్తానని హామీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ లక్ష్మి వివరించారు.
అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించారు. అన్న కాంటీన్ నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం, టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం, రోడ్ల నిర్మాణాలు ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు, గురుకుల ప్రాథమిక పాఠశాలలో అవసరమైన వసతులు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించి ప్రభుత్వపరంగా సహకరించాలని కోరారు. దీనిపై లోకేష్ సానుకూలంగా స్పందించి కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం అని ప్రజల అవసరాలు తీర్చడమే మన లక్ష్యమని ఆయన వివరించారన్నారు. ముఖ్యంగా విద్యా పరంగా డిగ్రీ కాలేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అటు పార్టీ కార్యక్రమాల పరంగా సభ్యత్వ నమోదు లోను ప్రభుత్వ పథకాల అమలు పనితీరుపై దర్శి ఇన్చార్జ్ గా డాక్టర్ లక్ష్మీ చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు. మీ భవిష్యత్తుకు భరోసా నాది కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీని అభివృద్ధి చేసేందుకు మీరు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు.
అదేవిధంగా నియోజకవర్గంలో టిడిపి కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించాలని నిర్మాణ బాధ్యత నేను తీసుకుంటామని డాక్టర్ లక్ష్మి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా జిల్లా స్థాయిలో ముందు కార్యాలయాలు ఏర్పాటు చేశాక నియోజకవర్గం స్థాయిలో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుందామని లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు లోకేష్ తో నేడు జరిగిన భేటీ ఎంతో సంతృప్తిగా ఉందని దర్శి అభివృద్ధికి లోకేష్ ఇచ్చిన హామీ పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
What's Your Reaction?