Jagga Reddy : కేటీఆర్ మంత్రి పదవి రాజీవ్ పెట్టిన భిక్ష : జగ్గారెడ్డి

సచివాలయం ఎదుట ప్రతిష్ఠించే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చివేస్తామని కేటీఆర్ ప్రకటించడాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి తప్పుబట్టారు. రాజీవ్ విగ్రహాన్ని తీసేస్తా అనటానికి నువ్వెవరు ? తెలంగాణ నీ జాగీరా ? నీ అయ్య జాగీరా ? అని మండి పడ్డారు. గాంధీభవన్ లో జగ్గారెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాజీవ్ విగ్రహం తీసేస్తా మంటే ఊరుకుంటామా ? ఖబడ్డార్ అని హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహం గుండెల్లో ఉండాలని, అందుకే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నామని స్పష్టంచేశారు. "రాజీవ్ గాంధీ దేశానికి తీసుకువచ్చిన ఐటీ ద్వారానే నీకు (కేటీఆర్) కు ఉద్యోగం వచ్చిన విషయం నిజం కాదా ? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి కాళ్లు మొక్కుతాం... మీరు కూడా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ కాళ్ళు మొక్కారు కదా ? అది కూడా గులాంగిరి లో భాగమేనా?" అని విరుచుకుపడ్డారు.

Aug 23, 2024 - 11:18
 0  1
Jagga Reddy : కేటీఆర్ మంత్రి పదవి రాజీవ్ పెట్టిన భిక్ష : జగ్గారెడ్డి

సచివాలయం ఎదుట ప్రతిష్ఠించే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చివేస్తామని కేటీఆర్ ప్రకటించడాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి తప్పుబట్టారు. రాజీవ్ విగ్రహాన్ని తీసేస్తా అనటానికి నువ్వెవరు ? తెలంగాణ నీ జాగీరా ? నీ అయ్య జాగీరా ? అని మండి పడ్డారు.

గాంధీభవన్ లో జగ్గారెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాజీవ్ విగ్రహం తీసేస్తా మంటే ఊరుకుంటామా ? ఖబడ్డార్ అని హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహం గుండెల్లో ఉండాలని, అందుకే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నామని స్పష్టంచేశారు.

"రాజీవ్ గాంధీ దేశానికి తీసుకువచ్చిన ఐటీ ద్వారానే నీకు (కేటీఆర్) కు ఉద్యోగం వచ్చిన విషయం నిజం కాదా ? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి కాళ్లు మొక్కుతాం... మీరు కూడా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ కాళ్ళు మొక్కారు కదా ? అది కూడా గులాంగిరి లో భాగమేనా?" అని విరుచుకుపడ్డారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News