Jio Cloud :గూగుల్‌, యాపిల్‌కు ఉహించని షాకిచ్చిన జియో

Jio Cloud :గూగుల్‌, యాపిల్‌కు ఉహించని షాకిచ్చిన జియో

Sep 2, 2024 - 15:46
Sep 2, 2024 - 16:05
 0  23
Jio Cloud :గూగుల్‌, యాపిల్‌కు ఉహించని షాకిచ్చిన జియో

Jio Cloud :గూగుల్‌, యాపిల్‌కు ఉహించని షాకిచ్చిన జియో - దీపావళి నుంచి 100 జీబీ వరకూ క్లౌడ్‌ స్టోరేజీని వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. దీంతో ఈ విభాగంలో కీలకంగా ఉన్న గూగుల్, యాపిల్‌ సేవలపై ప్రభావం పడుతుందని ఎక్స్​ పర్ట్స్​ అంటున్నారు. జియో ఎంట్రీతో క్లౌడ్ స్టోరేజ్‌ విభాగంలో గూగుల్, యాపిల్‌ తమ సేవల ధరలు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌ యూజర్లు స్టోరేజీ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ యూజర్లలో అధిక మంది గూగుల్‌ ఉచితంగా అందిస్తున్న15జీబీ డేటా పరిమితికి చేరువయ్యారు. దీంతో వారు అదనపు స్టోరేజీ కోసం గూగుల్‌ వన్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రస్తుతం గూగుల్‌ వన్‌ 100 జీబీ స్టోరేజీ ధర నెలకు రూ.130 ఉండగా.. ఐక్లౌడ్‌ 50జీబీ స్టోరేజీ ధర రూ.75గా ఛార్జ్‌ వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ 47వ వార్షిక సాధారణ సమావేశంలో అంబానీ క్లౌడ్‌ సేవల గురించి ప్రస్తావించారు. ‘‘ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి డిజిటల్‌ కంటెంట్‌ను జియో యూజర్లు భద్రంగా దాచుకునేలా జియో క్లౌడ్‌ స్టోరేజీని తీసుకురాబోతున్నాం. వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందించనున్నాం. ఇంకా ఎక్కువ క్లౌడ్‌ స్టోరేజీని కావాలనుకునే వాళ్లకి అందుబాటు ధరల్లోనే అందిస్తాం’’ అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News