Jobs Scam : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం .. ఆరుగురు అరెస్ట్
ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు చెప్పి డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైనట్లు ఫేక్ పాత్రలు సృష్టించి అమాయకులను బురిడీ కొట్టించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోసాలకు పాల్పడ్డ ఆరుగురిని అరెస్ట్ చేసామన్నారు. వీరు మొత్తం 3 రకాల నేరాలు చేశారని, ఈ ముఠా చేతిలో 108 మంది బాధితులు ఉన్నారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి రూ. లక్ష 97 వేలు, 8 మొబైల్స్ సీజ్ చేశామన్నారు. సురేందర్ అని ఈ ముఠాలో కీలక వ్యక్తన్నారు. ప్రభుత్వ పెద్దల పేరుతో బదిలీల విషయంలోనూ గురుకుల అధికారులను మోసం చేశారని ఆయన తెలిపారు. వేం నరేందర్ రెడ్డి అనుచరులని దాదాపు రూ. 1. 29 కోట్ల డబ్బు వసూల్ చేసినట్లు వెల్లడించారు.

What's Your Reaction?