Jr NTR: తల్లి చిరకాల కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్
Jr NTR: తల్లి చిరకాల కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్
స్టార్ హీరో ఎన్టీఆర్ శనివారం తన తల్లితో కలిసి ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ నటుడు రిషబ్‌శెట్టి కూడా ఎన్టీఆర్ వెంట ఉన్నారు. దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్ పంచుకుంటూ.. ‘అమ్మ ఎప్పుడూ నన్ను తన సొంతూరు కుందాపురాతో పాటు, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనానికి వెళుదామని అడుగుతుంటుంది. ఇప్పుడు ఆమె కల నెరవేరింది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకు ఇచ్చే మంచి బహుమతి ఇదే. విజయ్ కిరంగదూర్ సర్ (హోంబలే ఫిలింస్ అధినేత).. మీకు ధన్యవాదాలు. నా ప్రియమిత్రుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే రిషబ్‌శెట్టి కూడా వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అని ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ఫొటోలను పంచుకున్నారు.
What's Your Reaction?