Kalyan Ram : ‘మెరుపు’లా వస్తోన్న కళ్యాణ్ రామ్
‘నందమూరి కళ్యాణ్ రామ్ కొన్నాళ్లుగా దూకుడు పెంచాడు. అంతకు ముందు చాలా స్లోగా సినిమాలు చేసేవాడు. వీటిలో చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నవే ఉన్నాయి. అందుకే వేగం పెంచాడు. మూడు నాలుగు సినిమాలు వస్తే ఒక్కటి హిట్ అయినా సెట్ అయిపోతుందని తెలుసు. అందుకే ఈ దూకుడు. ప్రస్తుతం కెరీర్ లో 21వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో విజయశాంతి ఓ పవర్ ఫుల్ ఐపిఎస్ పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. ఇక లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు కళ్యాణ్ రామ్.సుకుమార్ శిష్యుడుగా పరిచయమై.. ఫస్ట్ మూవీ కుమారి 21 ఎఫ్ తో అందరినీమెప్పించిన దర్శకుడు సూర్య ప్రతాప్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. సూర్య ప్రతాప్ లాస్ట్ మూవీ 18 పేజెస్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సారి ఓ బలమైన కథతో కళ్యాణ్ రామ్ ను అప్రోచ్ అయ్యాడు. అతనికీ నచ్చిందట. ఈ చిత్రానికి ‘‘మెరుపు’’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నారు. మెరుపు అనే టైటిల్ వినగానే ఆకట్టుకుంటుంది. క్యాచీగానూ ఉంది. టైటిల్ జస్టిఫికేషన్ లా కథ, కథనాలుంటే ఖచ్చితంగా హిట్ కొట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ మూవీతో పాటు మరికొన్ని కథలు కూడా రెగ్యులర్ గా వింటున్నాడు కళ్యాణ్ రామ్. ఇవి కాక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీ సినిమాల నిర్మాణంలో భాగస్వామిగానూ బిజీ అవుతున్నాడు.
‘నందమూరి కళ్యాణ్ రామ్ కొన్నాళ్లుగా దూకుడు పెంచాడు. అంతకు ముందు చాలా స్లోగా సినిమాలు చేసేవాడు. వీటిలో చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నవే ఉన్నాయి. అందుకే వేగం పెంచాడు. మూడు నాలుగు సినిమాలు వస్తే ఒక్కటి హిట్ అయినా సెట్ అయిపోతుందని తెలుసు. అందుకే ఈ దూకుడు. ప్రస్తుతం కెరీర్ లో 21వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో విజయశాంతి ఓ పవర్ ఫుల్ ఐపిఎస్ పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. ఇక లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు కళ్యాణ్ రామ్.
సుకుమార్ శిష్యుడుగా పరిచయమై.. ఫస్ట్ మూవీ కుమారి 21 ఎఫ్ తో అందరినీమెప్పించిన దర్శకుడు సూర్య ప్రతాప్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. సూర్య ప్రతాప్ లాస్ట్ మూవీ 18 పేజెస్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సారి ఓ బలమైన కథతో కళ్యాణ్ రామ్ ను అప్రోచ్ అయ్యాడు. అతనికీ నచ్చిందట. ఈ చిత్రానికి ‘‘మెరుపు’’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నారు. మెరుపు అనే టైటిల్ వినగానే ఆకట్టుకుంటుంది. క్యాచీగానూ ఉంది. టైటిల్ జస్టిఫికేషన్ లా కథ, కథనాలుంటే ఖచ్చితంగా హిట్ కొట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ మూవీతో పాటు మరికొన్ని కథలు కూడా రెగ్యులర్ గా వింటున్నాడు కళ్యాణ్ రామ్. ఇవి కాక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీ సినిమాల నిర్మాణంలో భాగస్వామిగానూ బిజీ అవుతున్నాడు.
What's Your Reaction?