Kangana Ranaut : బీటౌన్ పై కంగనా రనౌత్ హాట్ కామెంట్స్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి బీటౌన్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. టాలెంట్ ఉన్నోళ్లకు బాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు ఉండదని తెలిపింది. ప్రోత్సహించే వారు కూడా ఉండరని.. తాను అదే విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని, తనను బహిష్కరించారని చెప్పుకొచ్చింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పొలిటికల్ లైఫ్ ఆధారంగా కంగనా రనౌత్ లీడ్ రోల్ లో రాబోతున్న మూవీ ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహించింది. సెప్టెంబర్ 6న రిలీజ్ కానుండగా.. మూవీ ప్రమోషన్లలో భాగంగా కంగనా బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు చేసింది.‘నా వరకూ నేను మంచి వ్యక్తిని. నా చుట్టూ ఉన్న వారితో బాగానే ఉంటా. ఎన్నికల్లోనూ గెలిచా. ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రేమాభిమానం పొందా. దీనిని బట్టి చూస్తే నాతో కొంతమందికి మాత్రమే సమస్య ఉంది. ఆ సమస్య నాలో ఉందా? లేదా వారిలో ఉందా? అనేది వారు కూడా ఒక్కసారి ఆలోచిస్తే మంచిది. నా దృష్టిలో బాలీవుడ్ ఒక హోప్ లెస్ ప్లేస్. ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు మనకు ఎలాంటి సాయం చేయరు. టాలెంట్‌ను చూసి వారు అసూయపడతారు. ఎవరైనా టాలెంట్ ఉన్న వ్యక్తులు తమ దృష్టిలో పడితే తప్పకుండా వారి కెరీర్ నాశనం చేయడానికి చూస్తారు. పీఆర్‌లను నియమించి వారిపై దారుణంగా తప్పుడు ప్రచారం చేయిస్తారు. ఇండస్ట్రీ వారిని బహిష్కరించేలా సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తారు’అని కంగనా రనౌత్ ఆరోపించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.

What's Your Reaction?