Kangana Ranaut : కంగనా రనౌత్ ఎమర్జెన్సీ బ్యాన్ చేయాలి : ఎంపీ సరబ్ జిత్ సింగ్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తు న్న సినిమా ఎమర్జెన్సీ. 1975లో ఇందిరాగాంధీ భారతదేశంలో విధించిన ఎమర్జె న్సీ కాలం, ఇందిర పోరాటం, ఆమె హత్య కథను చూపించనున్నారు. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ తదితరులు ఈ సినిమాలో నటించారు. సెప్టెంబర్ 6న రిలీజ్ కానున్న ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీని నిషేధించాలని పంజాబ్ లోని పరీద్ కోట్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా డిమాండ్ చేస్తున్నారు. 'ఎమర్జెన్సీ' చిత్రం సిక్కు సమాజాన్ని తప్పుగా చూపుతుందని.. దాని వల్ల శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తన ఫేస్ బుక్ పోస్టులో రా సుకొచ్చారు. ‘ఈ సినిమాలో సిక్కులను వేర్పాటు వాదులుగా, ఉగ్రవాదులుగా చూపించారంటే అది భారీ కుట్రగా భావిస్తున్నాం. ఈ చిత్రం ఇతర దేశాలలో సిక్కులపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి కారణమవ్వొచ్చు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఆపాలి. దేశంలో సిక్కులపై విద్వేషపూరిత దాడుల వార్తలు తరచుగా తెరపైకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ చిత్రం సిక్కు సమాజంపై ద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేలా ఉంటుంది. సిక్కు సమాజం ఈ దేశం కోసం గొప్ప త్యాగాలు చేసింది. వాటిని ఈ పూర్తిగా సినిమాల్లో చూపించలేదు.” అని పేర్కొన్నారు.

What's Your Reaction?