KAVITHA: కవిత వ్యాఖ్యల వెనక మర్మమేంటి..?
కవిత భవిష్యత్తు కార్యాచరణపై ఉత్కంఠ.. వడ్డీతో సహ చెల్లిస్తా అన్న వ్యాఖ్యల వెనక మర్మమేంటి..?
‘నేను కేసీఆర్ బిడ్డను..తప్పు చేసే ప్రసక్తే లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఇదీ అలాంటిదే. సాధారణంగానే నేను మొండిదాన్ని.. కానీ, నన్ను అనవసరంగా జైలుకు పంపించి జగమొండిదాన్ని చేశారు. పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండటం తల్లిగా చాలా ఇబ్బందికరమైన విషయం. ఏ తప్పు చేయకున్నా నన్ను జైలుకు పంపారు. అనవసరంగా జగమొండిని చేశారు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఆ సమయం అతి త్వరలోనే రాబోతోంది అని జైలు నుంచి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. 153 రోజుల జైలు జీవిత నుంచి విడుదైన ఎమ్మెల్సీ కవిత చేసిన ఈ వ్యాఖ్యలతో ఆమె తదుపరి రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తిగా మారింది.
తెలంగాణ జాగృతితో...తెలంగాణ ఉద్యమ సయమంలో కేసీఆర్ కుమార్తె కవిత కీలక పాత్ర పోషించారు. అన్ని వర్గాలను ఏకతాటిపై తేవడంలో కృషి చేశారు. ముఖ్యంగా మహిళలు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించేలా ప్రోఉత్సహించారు. అలాగే తెలంగాణ జాగృతి పేరుతో సబ్బండ వర్ణాలను ఉద్యమంలో కలుపుకుని ముందుకు పోయారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ అని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండంతో కల్వకుంట్ల కుటుంబం ఆమెను రాజకీయాలకు దూరంగా ఉంచనుంది అనే ప్రచారం కాంగ్రెస్, బీజేపీ విస్తృతంగా సాగించాయి.
అలాగే, ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం పార్టీ అప్రతిష్టకు కారణమైందని, అందుకే జైల్లో కవితను చూసేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే కవితకు బెయిల్ దక్కడంతో ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండనుంది…? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కవిత సుప్రీంకోర్టులో బెయిల్ లభించగానే ఆమె రాజకీయ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలు అయ్యాయి.
కొన్నాళ్ళు ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు అనే చర్చ కూడా జరిగింది. కానీ , జైలు నుంచి బయటకొచ్చాక కవిత చేసిన ప్రకటన ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని తేల్చేసిన కవిత..గతానికి మించి మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తాననే సంకేతాలు పంపారు. దీంతో ఇటు రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనూ, అటు కేంద్రంలో బీజేపీ పైనా నిరసనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ఎంపీగాను ఉండటంతో కేంద్రంలోని విధి విధానాలను వ్యతిరేకించే, వాటిపై ఆందోళనలు చేపట్టే వీలుంది
What's Your Reaction?