Kavitha 2.0 : కవిత 2.0.. రీఎంట్రీ ఏర్పాట్లు ఇవే

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన అగ్రెసివ్ ఫామ్ ను జైలు నుంచి బయటకు రాగానే చూపించారు. చాలా మంది ఆమెను అరుంధతిని పోలిన పవర్ ఫుల్ పొలిటీషియన్ గా మారనున్నట్టు చెబుతున్నారు. ఆమె మెడలోని జపమాల అందుకు సాక్ష్యమంటున్నారు. జైలులో ఉన్నప్పుడు తనకు మనశ్శాంతి కోసం జపం చేసుకునేందుకు జపమాలను అనుమతించాలని కోర్టును కోరి మరీ ఆమె జపమాల వేసుకున్నారు. బయటకు వచ్చాక కూడా అదే జపమాలలో కనిపించారు. అది తన పంతానికి సాక్ష్యమని.. ఆ జపమాలను చూసినప్పుడల్లా తన ఐదున్నర నెలల జైలు జీవితం గుర్తుకు రావాలని అలా చేశారని చెబుతున్నారు. తన జైలుజీవితానికి కారకులను వడ్డీతో సహా చెల్లిస్తానని అందుకే చెప్పినట్టు విశ్లేషిస్తున్నారు. ఇకనుంచి తెలంగాణలో కవిత అంటే సున్నితమైన మనస్కురాలిగా కాకుండా.. అగ్రెసివ్ కవితను చూడబోతున్నారని బీఆర్ఎస్ నేతలుఅంటున్నరాు.తీహార్‌ జైలు నుంచి విడుదలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నేడు హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి కవిత సహా ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. కవిత జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సందడి నెలకొంది. నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్‌ జైలులో ఉన్నారు కవిత. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరుచేసింది. తీహార్‌ జైలు నుంచి విడుదల అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు. "నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతా"నన్నారు కవిత.

Aug 28, 2024 - 17:07
 0  2
Kavitha 2.0 : కవిత 2.0.. రీఎంట్రీ ఏర్పాట్లు ఇవే

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన అగ్రెసివ్ ఫామ్ ను జైలు నుంచి బయటకు రాగానే చూపించారు. చాలా మంది ఆమెను అరుంధతిని పోలిన పవర్ ఫుల్ పొలిటీషియన్ గా మారనున్నట్టు చెబుతున్నారు. ఆమె మెడలోని జపమాల అందుకు సాక్ష్యమంటున్నారు. జైలులో ఉన్నప్పుడు తనకు మనశ్శాంతి కోసం జపం చేసుకునేందుకు జపమాలను అనుమతించాలని కోర్టును కోరి మరీ ఆమె జపమాల వేసుకున్నారు. బయటకు వచ్చాక కూడా అదే జపమాలలో కనిపించారు. అది తన పంతానికి సాక్ష్యమని.. ఆ జపమాలను చూసినప్పుడల్లా తన ఐదున్నర నెలల జైలు జీవితం గుర్తుకు రావాలని అలా చేశారని చెబుతున్నారు. తన జైలుజీవితానికి కారకులను వడ్డీతో సహా చెల్లిస్తానని అందుకే చెప్పినట్టు విశ్లేషిస్తున్నారు. ఇకనుంచి తెలంగాణలో కవిత అంటే సున్నితమైన మనస్కురాలిగా కాకుండా.. అగ్రెసివ్ కవితను చూడబోతున్నారని బీఆర్ఎస్ నేతలుఅంటున్నరాు.

తీహార్‌ జైలు నుంచి విడుదలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నేడు హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి కవిత సహా ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. కవిత జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సందడి నెలకొంది. నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్‌ జైలులో ఉన్నారు కవిత. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరుచేసింది. తీహార్‌ జైలు నుంచి విడుదల అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు. "నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతా"నన్నారు కవిత.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News