Kavitha Bail : కవిత బెయిల్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని.. ఆ కారణంగానే కవితకు ఐదు నెలల్లోనే బెయిల్ వచ్చిందని ఆరోపించారు. బీజేపీకి సీట్ల బదిలీతో సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్లలో బీఆర్ఎస్కు ఓట్లు తగ్గాయన్నారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ చాలా ఆలస్యంగా వచ్చిందని గుర్తుచేశారు. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారని చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం ఇంకా జైల్లోనే ఉన్నారని తెలిపారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. బీఆర్ఎస్కు ఓ న్యాయం.. మిగితావారికి మరో న్యాయమా అని రేవంత్ ప్రశ్నించారు.

What's Your Reaction?