Kavitha : కవితను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. జూలై 16న తొలిసారి అస్వస్థ తకు గురయ్యారు. అప్పుడు కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్య లను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు. మళ్లీ ఆగస్టు 22న కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీ ఎయిమ్సుకు కవితను తరలించి.. ఆమె భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమ యంలో తిరిగి జైలుకు తరలించారు. ఎమ్మెల్సీ కవిత మార్చి 15వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమె సుమారు 11 కేజీల బరువు తగ్గారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. జూలై 16న తొలిసారి అస్వస్థ తకు గురయ్యారు.
అప్పుడు కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్య లను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు. మళ్లీ ఆగస్టు 22న కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీ ఎయిమ్సుకు కవితను తరలించి.. ఆమె భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమ యంలో తిరిగి జైలుకు తరలించారు.
ఎమ్మెల్సీ కవిత మార్చి 15వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమె సుమారు 11 కేజీల బరువు తగ్గారు.
What's Your Reaction?