Kavitha : ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం : కవిత
ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ బంజరాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న కవితకు పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘న్యాయబద్ధమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి.. కచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుంది. నిజం నిలకడమీద తెలుస్తుందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా. ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా’’ అని కవిత అన్నారు.ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. కవిత వెంట కేటీఆర్, హరీశ్‌రావు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఐదున్నర నెలలుగా తిహార్ జైలులో ఉన్న ఆమె మంగళవారం బెయిల్ మీద విడుదలయ్యారు. ఐదు నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్న కవితకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. విమానాశ్రయం వద్ద అందరికీ అభివాదం చేసిన కవిత... పిడికిలి బిగించి పోరాటాన్ని కొనసాగిస్తానంటూ సంకేతాలు ఇచ్చారు. జై తెలంగాణ అని నినదించారు. అనంతరం భారీ వాహన శ్రేణితో ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.
ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ బంజరాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న కవితకు పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘న్యాయబద్ధమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి.. కచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుంది. నిజం నిలకడమీద తెలుస్తుందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా. ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా’’ అని కవిత అన్నారు.
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. కవిత వెంట కేటీఆర్, హరీశ్‌రావు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఐదున్నర నెలలుగా తిహార్ జైలులో ఉన్న ఆమె మంగళవారం బెయిల్ మీద విడుదలయ్యారు. ఐదు నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్న కవితకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. విమానాశ్రయం వద్ద అందరికీ అభివాదం చేసిన కవిత... పిడికిలి బిగించి పోరాటాన్ని కొనసాగిస్తానంటూ సంకేతాలు ఇచ్చారు. జై తెలంగాణ అని నినదించారు. అనంతరం భారీ వాహన శ్రేణితో ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.
What's Your Reaction?