Kiran Abbavaram, Rahasya :
కిరణ్, రహస్యల పెళ్లై పోయింది
వర్ధమాన నటుడు కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్నాడు. తన ఫస్ట్ మూవీ రాజావారు రాణిగారు హీరోయిన్ రహస్య గోరక్ నే ప్రేమించాడు కిరణ్. సినిమా టైమ్ లోనే ప్రేమలో పడ్డారా.. లేక తర్వాత ప్రేమించుకున్నారా అనేది చెప్పలేదు కానీ.. ఎంగేజ్మెంట్ కు కొన్ని రోజుల ముందుగానే వీరి ప్రేమ గురించి జనానికి తెలిసింది. ఫస్ట్ మూవీ తర్వాత రహస్య కూడా ఎక్కువ సినిమాలేం చేయలేదు. నిశ్చితార్థం తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఈ గురువారం రాత్రి వీరి వివాహం కూర్గ్ లో జరిగింది. ఈ పెళ్లికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరూ మంచి జంటగా కనిపిస్తున్నారు.ఇక సినిమాల పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. విశేషం ఏంటంటే.. ఈ మూవీకి రహస్య గోరక్ ‘సి.ఇ.ఓ’గా వ్యవహరిస్తోంది. అంటే ఇకపై బ్యాక్ ఎండ్ లో ఉంటూ భర్త కెరీర్ నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉంటుందనే చెప్పాలి. ఈ నూతన జంటకు శుభాకాంక్షలు చెప్పేద్దాం.


వర్ధమాన నటుడు కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్నాడు. తన ఫస్ట్ మూవీ రాజావారు రాణిగారు హీరోయిన్ రహస్య గోరక్ నే ప్రేమించాడు కిరణ్. సినిమా టైమ్ లోనే ప్రేమలో పడ్డారా.. లేక తర్వాత ప్రేమించుకున్నారా అనేది చెప్పలేదు కానీ.. ఎంగేజ్మెంట్ కు కొన్ని రోజుల ముందుగానే వీరి ప్రేమ గురించి జనానికి తెలిసింది. ఫస్ట్ మూవీ తర్వాత రహస్య కూడా ఎక్కువ సినిమాలేం చేయలేదు. నిశ్చితార్థం తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఈ గురువారం రాత్రి వీరి వివాహం కూర్గ్ లో జరిగింది. ఈ పెళ్లికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరూ మంచి జంటగా కనిపిస్తున్నారు.
ఇక సినిమాల పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. విశేషం ఏంటంటే.. ఈ మూవీకి రహస్య గోరక్ ‘సి.ఇ.ఓ’గా వ్యవహరిస్తోంది. అంటే ఇకపై బ్యాక్ ఎండ్ లో ఉంటూ భర్త కెరీర్ నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉంటుందనే చెప్పాలి. ఈ నూతన జంటకు శుభాకాంక్షలు చెప్పేద్దాం.
What's Your Reaction?






