Kolkata Doctor Case : కోల్కతా డాక్టర్ సాక్ష్యాలు మార్చేశారు.. సీబీఐ సంచలన ప్రకటన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి రేప్, మర్డర్ కేసు దర్యాప్తు రిపోర్టులో సీబీఐ సంచలన నిజాలు బయటపెట్టింది. ఘటన జరిగిన ఐదు రోజులకు కేసు దర్యాప్తును తమకు అప్ప గించారని తెలిపిన సీబీఐ, తాము ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి క్రైమ్ సీన్ ను పూర్తిగా మార్చివేశారని పేర్కొంది. బాధితురాలి మృతదేహం దహనం జరిగాక ఎఫ్ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పింది. ఇందుకు సంబంధించి పలువురు పోలీస్ అధికారులు, వైద్యుల వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపింది. తొలుత వైద్యురాలి మరణం ఆత్మహత్యగా ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని, మృతదేశం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు దారి తీయడంతో ఆమె సహోద్యోగులు, తల్లిదండ్రులు వీడియోగ్రఫీకి పట్టు బడితే, అప్పుడు తప్పనిసరై పోలీస్ అధికారులు పోస్టుమార్టం వీడియో తీశారని వివరించింది. ఈ మేరకు సీబీఐ సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది.


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి రేప్, మర్డర్ కేసు దర్యాప్తు రిపోర్టులో సీబీఐ సంచలన నిజాలు బయటపెట్టింది. ఘటన జరిగిన ఐదు రోజులకు కేసు దర్యాప్తును తమకు అప్ప గించారని తెలిపిన సీబీఐ, తాము ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి క్రైమ్ సీన్ ను పూర్తిగా మార్చివేశారని పేర్కొంది.
బాధితురాలి మృతదేహం దహనం జరిగాక ఎఫ్ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పింది. ఇందుకు సంబంధించి పలువురు పోలీస్ అధికారులు, వైద్యుల వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపింది.
తొలుత వైద్యురాలి మరణం ఆత్మహత్యగా ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని, మృతదేశం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు దారి తీయడంతో ఆమె సహోద్యోగులు, తల్లిదండ్రులు వీడియోగ్రఫీకి పట్టు బడితే, అప్పుడు తప్పనిసరై పోలీస్ అధికారులు పోస్టుమార్టం వీడియో తీశారని వివరించింది. ఈ మేరకు సీబీఐ సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది.
What's Your Reaction?






